ఇక్కడ టీడీపీ నిలదొక్కుకునే ప్రసక్తే లేదా?
రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకమైన మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రధానం. ఇక్కడి మూడు జిల్లాలలోనూ ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. [more]
రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకమైన మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రధానం. ఇక్కడి మూడు జిల్లాలలోనూ ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. [more]
రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కీలకమైన మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రధానం. ఇక్కడి మూడు జిల్లాలలోనూ ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. పార్టీ ఓడిపోయిన 2004లోనూ ఇక్కడ ఏకంగా మూడు ఎంపీ సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో మంచి పట్టు సాధించింది. అంతెందుకు .. గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ జగన్ సునామీ బలంగా ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. చాలా నియోజకవర్గాలను తక్కువ మార్జిన్‌తోనే కోల్పోయింది. దీనిని బట్టి ఉత్తరాంధ్రలో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలం ఏంటో నిరూపితమవుతోంది. పార్టీ ఓడిన యేడాది కాలంలోనే పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి ? ఎవరు పార్టీలో ఉన్నారు ? ఉంటారు ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
పార్టీని వీడే వాళ్లు చాలా….
విశాఖలో చాలా మంది నాయకులు, చాలా నియోజకవర్గాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో మెలుగుతున్నారు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్దాం.. ఆయన ఎక్కడ ఉంటే.. అక్కడే ఉందాం.. అనే ధోరణి పెరిగిపోయింది. గంటాను కాకుండా ఇక్కడ పార్టీకి విధేయులుగా ఉన్నవారిలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు గంటాను నమ్ముతున్నారే కాని. పార్టీ అధిష్టానంను నమ్మే పరిస్థితి లేదు. ఇది పార్టీకి పెనుముప్పుగా మారిపోయింది.
ఎవరూ బయటకు రాకుండా….
ఇక ఉన్న నేతలు కూడా పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వంటి వారు పార్టీ మారిపోయారు. ఇక విజయనగరంలో టీడీపీకి బలమైన నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు ఉన్నా ఆయనే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో షాక్ తగలడంతో నిర్వేదంతో ఉన్నారు. ఇక అశోక్ వంటి బలమైన నేతనే అధికార పార్టీ ఇరుకున పెట్టిందంటే మేం ఎంత అన్నట్టుగా మిగిలిన నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక్కడ చాలా మంది పార్టీ నాయకులు మంత్రి బొత్స కంట్రోల్ లోనే ఉంటున్నారన్న టాక్ ఉంది.
ఇక్కడే కొంతలో కొంత నయం…
ఇక, ఎటొచ్చీ.. శ్రీకాకుళం. ఇక్కడ ఎంపీ స్థానం టీడీపీకి దక్కింది. అదే సమయంలో టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు కూడా టీడీపీ గెలుచుకుంది. పైగా ఇక్కడ వైసీపీలోని నేతల మధ్య ఆధిపత్య ధోరణి తారస్థాయిలో కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ఒక్క చోటే టీడీపీ పుంజుకునేందుకు చిన్న అవకాశం ఉంది. కింజరాపు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుతోపాటు..కూన రవి కుమార్, గౌతు శిరీష వంటి యువ నేతలు పార్టీకి ఒకింత అండగా ఉన్నారు. పైగా వీరు పార్టీలు మారే దృక్ఫథం ఉన్న నాయకులు కూడా కాకపోవడం ఒక్కటే చంద్రబాబుకు కలిసి వస్తున్న పరిణామంగా చెబుతున్నారు. అదే సమయంలో వైజాగ్ రాజధానిని పార్టీ లైన్‌కు భిన్నంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఏదేమైనా ఓవరాల్‌గా ఉత్తరాంధ్రలో టీడీపీకి శ్రీకాకుళంలో మాత్రమే కాస్తో కూస్తో ఆశలు ఉన్నాయి.