జబర్దస్త్ గా… తొడకొట్టి మరీ

జబర్దస్త్ చేయాలంటే పసుపు తమ్ముళ్ళ కంటే ఎవరూ ముందుండరేమో. ఏపీలో అధికారం పోయినా విశాఖలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. దాంతో ఆ పార్టీ నేతల్లో అదో [more]

Update: 2019-10-15 12:30 GMT

జబర్దస్త్ చేయాలంటే పసుపు తమ్ముళ్ళ కంటే ఎవరూ ముందుండరేమో. ఏపీలో అధికారం పోయినా విశాఖలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. దాంతో ఆ పార్టీ నేతల్లో అదో రకమైన ధీమా కనిపిస్తోంది. దాంతో ఏపీలో జగన్ సర్కార్ ఉంటే ఉండనీ ఇక్కడ మాదేరాజ్యం అంటున్నారు. చంద్రబాబు విశాఖ టూర్ సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ త‌మ్ముళ్ళు బ్యానర్లు కట్టేశారు. కటౌట్లు పెట్టేశారు. ప్రతీ జంక్షన్ని పసుపు తోరణాలతో నింపేశారు. ఇది చూసిన వారికి ఎవరికైనా ఏపీలో అధికార పార్టీ టీడీపీయేనా? అనిపించకమానదు. తాము ఏదనుకుంటే అది చేస్తున్న తమ్ముళ్లు విమర్శలు మాత్రం వైసీపీ మీద ఎక్కుపెడుతున్నారు.

నాలుగు దిక్కులా…..

మోహరించాలంటే నాలుగు దిక్కులూ కలసిఉండాలి. టీడీపీకి అలా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కూడా రాజకీయ ఆధిపత్యం చేసే ఛాన్స్ ఇచ్చింది విశాఖ. నలుగురు ఎమ్మెల్యేలూ టీడీపీవారే. దాంతో అధికారులను సైతం తమ మాట వినమంటున్నారు తమ్ముళ్ళు. తాము ఏం చేసినా విశాఖలో బలమైన పార్టీగా ఉన్నామని ఒకటికి పదిమార్లు చెబుతున్నారు. ఇక బలమైన నాయకులంతా టీడీపీలోనే ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలు ఇప్పటికీ విశాఖలో టీడీపీవైపే ఉండడం కూడా ఆ పార్టీ జబర్దస్త్ చేయడానికి కలసివస్తోంది మరో వైపు అధికార వైసీపీ పార్టీ బలహీనతలే టీడీపీకి బలంగా మారుతున్నాయి.

గతంలో అలా….

గతంలో జగన్ విశాఖకు వస్తే ఆయన కోసం కట్టిన బ్యానర్లను తీసివేయించేవరకూ తమ్ముళ్ళు ఊరుకునేవారుకాదు. నాడు అధికార పార్టీ కాబట్టి మాట చెల్లిందనుకుంటే నేడు కూడా విశాఖ వీధుల్లో టీడీపీ పసుపు రంగులే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులు సైతం మౌనంగా చోద్యం చూస్తున్నారు తప్ప నిబంధనలు గుర్తు చేసి తీయించడలేదు. దీనికంతంటికీ కారణం వైసీపీ అసమర్ధ నాయకత్వం, విశాఖ సిటీలో మీడియా ముందు నాలుగు కబుర్లు చెప్పి వెళ్ళిపోయే బాపతు తప్ప నిజమైన ప్రజా బలం ఉన్న నాయకులు వైసీపీలో ఎవరూ లేరు. పైగా బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలు కూడా లేకపోవడం వల్లనే తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు అయింది. విశాఖలో ఘనంగా ఉనికి చాటుకుంటున్న టీడీపీ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో జెండా ఎగరవేసినా వైసీపీ ఏం చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మరి చూడాలి వైసీపీ హై కమాండ్ ఏ రకమైన చర్యలు తీసుకుని సిటీలో పార్టీని రీఛార్జి చేస్తుందో.

Tags:    

Similar News