టోటల్ ఛేంజ్ చేయాలటగా

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌త‌నానంత‌రం.. అనేక జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే.. చాలా చిత్ర మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ క్లీన్ [more]

Update: 2019-11-17 03:30 GMT

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌త‌నానంత‌రం.. అనేక జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే.. చాలా చిత్ర మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో అయితే, టీడీపీ ప‌రిస్థితి నానా చింద‌ర వంద‌ర‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. తీవ్రమైన వ్యతిరేక‌త ఉన్నవారికి కూడా చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వడం, వారు ఓడిపోయిన వెంట‌నే టీడీపీని కూడా ప‌క్కకు పెట్టి. సొంత వ్యాపారాలు చేసుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో కొన్ని ప‌ట్టున్న జిల్లాలు కూడా టీడీపీ ఉనికి లేకపోయింది. ఇలాంటి కీల‌క‌మైన జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. ఏపీ సాంస్కృతిక రాజ‌ధానిగా పేరు తెచ్చుకున్న ఈ జిల్లాలో టీడీపీ పిల్లి మొగ్గలు వేస్తోంది.

వ్యతిరేకత ఉన్నా….

జిల్లాలో నాయ‌క‌త్వ లేమితీవ్రంగా క‌నిపిస్తోంది. దీంతో ఇక్కడి నాయ‌కులు కూడా మార్పును కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా మ‌హంతి చిన్నంనాయుడు ఉన్నారు. అయితే, ఈయన వ‌యో వృద్ధుడు కావ‌డంతో పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ త‌ర‌పున ఏ కార్యక్రమం చేప‌ట్టినా.. ఆయ‌న స‌హ‌క‌రించ‌క పోవ‌డంతో పార్టీలో ఊపు క‌నిపించ‌డంలేదు. ఇక‌, ఈ ఏడాదిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. కొంద‌రు నాయ‌కుల‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. అయితే, వారు ఘోరంగా ఓడిపోయారు.

తిరగలేక..ఓపిక లేక….

ఇక‌, ఇప్పటికే టీడీపీలో ఉన్న నాయ‌కులు వ‌యోవృద్ధులు కావ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు, ప‌తివాడ నారాయ‌ణ‌స్వామిలు వ‌యోవృద్ధులు అయ్యారు. దీంతో వాళ్లు ప్రజ‌ల్లో యాక్టివ్‌గా తిర‌గ‌లేక పోతున్నారు. ఇక‌, బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు బేబి నాయ‌న మాత్రమే ప్రజ‌ల్లో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం కోళ్ల అప్పల‌నాయుడు ప‌రిస్థితి కూడా అంతే. కోళ్లకు గ‌త ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వవ‌ద్దని ఆయ‌న సోద‌రుడితో పాటు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు అంద‌రూ ఎదురు తిరిగినా బాబు ఆయ‌న‌కే సీటు ఇవ్వగా చిత్తుగా ఓడిపోయారు. కోళ్ల ఇక రాజ‌కీయాలు మ‌ర్చిపోవ‌డ‌మే బెట‌ర్ అంటున్నారు.

కుటుంబ రాజకీయాలతో….

ఇక‌, అశోక్ కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు కొంత‌మేర‌కు ఫ‌ర్వాలేద‌ని అనిపిస్తున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఆమె ఓడిపోయినా.. ప్రజ‌ల్లో తిరుగుతున్నారు. వార్డుల వారీగా తిరుగుతూ స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, ఎస్ కోట‌కు చెందిన టీడీపీ నేత కోళ్ల ల‌లిత‌కుమారికి కుటుంబ రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయి. ఆమెకు కూట‌మి రాజ‌కీయాలు బాగా వంట‌బ‌ట్టాయా? అనే రేంజ్‌లో. బంధు వ‌ర్గాలు పెద్దల కుటుంబ జోక్యం ఎక్కువైంది. ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మికి ప్రధాన కార‌ణాల్లో కుటుంబ రాజ‌కీయాలే అయినా.. ఆమె ఓడిపోయాక కూడా వాటిని కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారు.

మార్చాలంటున్నా….

ఇక‌, చీపురుప‌ల్లిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున నాన్ లోక‌ల్ అయినా కూడా టికెట్ తెచ్చుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు నేల కూలారు. ఆయ‌న్ను మార్చాల‌ని స్థానిక నేత‌లు ఎంత చెపుతున్నా బాబు ప‌ట్టించుకోని ప‌రిస్థితి. ఇక‌, గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాలైన కురుపాం, సాలూరులో టీడీపీ నాయ‌కులు ట్రైబ‌ల్ రాజులు అయినా రాజులుగానే జ‌నాల్లోకి వెళ్లింది.. ఎస్టీల్లో మంచి నాయ‌కులు జ‌నార్థన్ థాట్రాజ్‌, భంజ‌దేవ్‌, గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే, వీరిలో వీరికి ఆధిప‌త్య రాజ‌కీయాలు పెరిగి పెద్దవ‌వుతున్నాయి.

డీలా పడిపోయి….

సాలూరులో టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణికి భంజ‌దేవ్‌కు పొస‌గ‌డం లేదు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త నాయ‌క‌త్వాన్ని ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల‌పై కూడా టీడీపీలోనే అసంతృప్తులు ఎక్కువుగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ఒక్క విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రమే అదితి గ‌జ‌ప‌తి దూసుకు పోతున్నారు. ఓడినా ఎప్పటిక‌ప్పుడు వార్డు మీటింగులు పెడుతూ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటున్నారు. ఇక జిల్లా అంత‌టా టీడీపీ డీలా ప‌డ‌డంతో ఇప్పుడున్న నాయ‌క‌త్వాన్ని మార్చి.. ప్రజ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుక‌న్న బేబినాయ‌న‌కు ఇవ్వాల‌నే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News