Tdp : బెజవాడ టీడీపీ భ్రష్టు పట్టడానికి కారణం ఆయనేనా?
బెజవాడ తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణాలో టీడీపీ కష్టాలు పడుతోంది. బలమైన సామాజికవర్గమే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. [more]
బెజవాడ తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణాలో టీడీపీ కష్టాలు పడుతోంది. బలమైన సామాజికవర్గమే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. [more]
బెజవాడ తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణాలో టీడీపీ కష్టాలు పడుతోంది. బలమైన సామాజికవర్గమే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆ సామాజికవర్గంపై ఆగ్రహంతో మిగిలిన కులాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. దీనికి తోడు నేతల మధ్య సయోధ్య ఎప్పుడూ సక్రమంగా లేదు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లనే విజయవాడ పార్టీ ఇలా నాశనమయిందన్న వ్యాఖ్యలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో….
మరీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ రాజధానిని విజయవాడకు మార్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడలో పార్టీని బలోపేతం చేయాల్సిన చంద్రబాబు ఇక్కడ మరింత బలహీన పర్చారు. పార్టీ నాయకులు ఒక్కొరొక్కరే బయటకు వెళ్లిపోవడానికి కారణం చంద్రబాబు కాదు. కానీ ఆయన నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు జిల్లాలో దేవినేని ఉమ, కొల్లు రవీంద్రకు కేబినెట్ లో స్థానం కల్పించారు.
ఉమకు ప్రయారిటీ ఇచ్చి….
అయితే దేవినేని ఉమ వైఖరి కారణంగా అనేక మంది అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఉమ వైఖరిపై చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు చేయకపోయినా, అప్పట్లో సీఎంవోలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న అధికారికి చెప్పారు. కానీ చంద్రబాబు దేవినేని ఉమను కంట్రోల్ చేయకపోగా ఆయనకు మరింత ప్రాధాన్యత పెంచారు. దీంతో 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రిజల్ట్ ప్రారంభమయింది.
పార్టీని వీడుతూ….
వల్లభనేని వంశీ పార్టీని వీడి వెళ్లారు. దేవినేని ఉమ కారణమని చెప్పారు. ఇక తాజాగా కేశినేని నాని కూడా ఇకపై ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నిర్ణయం తీసుకున్నారు. దీనికి నాని వేళ్లు ఉమనే చూపుతున్నాయి. ఉమకు సన్నిహితులైన వారే తనను టార్గెట్ చేశారని, వారిపై చర్యలు తీసుకోలేదని కేశినేని నాని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బెజవాడ టీడీపీలో ఎవరు ఎప్పుడు ఉంటారో? వెళతారో? అన్నది అర్థం కాకుండా ఉంది.