దిక్కు లేకుండా పోయిందే..?

రాష్ట్రంలో దూసుకుపోవాల‌ని భావించిన టీడీపీకి ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు భారీ షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించిన టీడీపీ [more]

Update: 2019-09-27 11:00 GMT

రాష్ట్రంలో దూసుకుపోవాల‌ని భావించిన టీడీపీకి ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు భారీ షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు దిక్కుతోచ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే, చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ముందుకు న‌డిపించే దిక్కు కూడా క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు మ‌రింత మైన‌స్‌గా మారిపోయింది. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు పార్టీకి, అధినేత‌కు కూడా మొహం చాటేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏదైనా కార్యక్రమం కోసం అధినేత పిలుపు ఇచ్చినా.. కొంద‌రు వ‌స్తున్నారు.. చాలా మంది డుమ్మా కొడుతున్నారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత…..

ఈ నేప‌థ్యంలో పార్టీ పుంజుకునేది ఎలా అనే స‌మ‌స్య తెర‌మీదికి వ‌స్తోంది. ఇక‌, నాణేనికి ఒక వైపు మాత్రమే మ‌రోప‌క్క, అధికార వైసీపీ ప్రతినియోజ‌క‌వ‌ర్గంలోనూ పుంజుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది. దీంతో చాలా మ‌టుకు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం కూడా క‌రువ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి వాటిలో రాజ‌కీయ రాజ‌ధానిన‌గ‌రంగా ఉన్న విజ‌య‌వాడ‌లోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. టీడీపీకి ఇక్కడ క‌నీసం జెండా మోసే దిక్కుకూడా క‌నిపించ‌డం లేదు. టీడీపీ ఆవిర్భవించిన త‌ర్వాత ఇక్కడ అస‌లు టీడీపీ నుంచి గెలిచిన నాయ‌కుడు ఎవ‌రూ లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ నుంచి గెలిచినా…..

మొద‌ట్లో కొన్నాళ్లపాటు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పుంజుకుంది. ఈ పార్టీ త‌రఫున జ‌లీల్‌ఖాన్ గెలుస్తూ వ‌చ్చారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీ వైపు చూడ‌డంతో 2014లో వైసీపీ టికెట్ ను ఆయ‌న‌కే కేటాయించ‌డం , ఆయ‌న విజ‌యం సాధించ‌డం జ‌రిగాయి. మ‌ధ్యలో మైనార్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని ఆశ చూప‌డంతో చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రానికి వ‌శుడైన జ‌లీల్ వెంట‌నే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేదు.

కూతురి ఓటమితో….

చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఎన్నో క‌ల‌ల‌లో ఉన్న ఆయ‌న క‌ల‌ల‌న్నీ క‌ల‌లుగానే మిగిలిపోయాయి. దీంతో తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తె ష‌బానా ఖ‌తూన్ రంగంలోకి దిగి పోటీ చేశారు. అమెరికాలో ఉంటోన్న ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆరు నెల‌ల ముందే ఇక్కడ‌కు వచ్చారు. కానీ, ఆమె వైసీపీ సునామీ ముందు కొట్టుకుపోయారు. ఓట‌మి చెందిన వెంట‌నే ఆమె తిరిగి అమెరికాకు చెక్కేసి అక్కడ వ్యాపార వ్యవ‌హారాల్లో మునిగిపోయారు.

నేతలందరూ….

ఇక‌, అప్పటి నుంచి జ‌లీల్ కూడా టీడీపీలో యాక్టివ్ గా లేకుండా పోయారు ఇంటికే ప‌రిమిత‌మై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఓడిన నాగుల్ మీరా కూడా పెద్దగా ఉత్సాహం చూపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ఉన్నప్పటికీ.. ఆయ‌న కేవ‌లం విమ‌ర్శల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో టీడీపీని ప‌ట్టించుకునే నాథుడు ఇక్కడ క‌నిపించ‌డం లేదు. కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోసం మ‌రోవైపు ఎంపీ కేశినేని నాని సైతం త‌న ప్రయ‌త్నాలు తాను చేస్తున్నారు.దీంతో గ్రూపు రాజ‌కీయం కూడా వేడెక్కుతోంది. మ‌రి పార్టీ ఎలా పుంజుకుంటుంందో ?చూడాలి.

Tags:    

Similar News