దులిపేసుకుంటున్నారటగా
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా అండ దండా అందించిన జిల్లా పశ్చిమ గోదావరి. ఇక్కడ అనేక నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. నిజానికి 2004, 2009 వైఎస్ ప్రభావంతో [more]
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా అండ దండా అందించిన జిల్లా పశ్చిమ గోదావరి. ఇక్కడ అనేక నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. నిజానికి 2004, 2009 వైఎస్ ప్రభావంతో [more]
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా అండ దండా అందించిన జిల్లా పశ్చిమ గోదావరి. ఇక్కడ అనేక నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. నిజానికి 2004, 2009 వైఎస్ ప్రభావంతో రాష్ట్రంలో ప్రతి ఇల్లూ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన సమయంలోనూ, టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన సందర్భంలోనూ ఈ జిల్లాలోని చాలా వరకు నియోజకవర్గాలుమాత్రం చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయి. 2004లో 4, 2009లో ఐదు సీట్లలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో అయితే, ఒక్క తాడేపల్లి గూడెం (బీజేపీ గెలిచింది) తప్ప మిగిలి అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయదుందుభి మోగించింది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీ మెజారిటీ కూడా కైవసం చేసుకున్నారు.
రెండే నియోజకవర్గాల్లో….
అయితే, 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి అధికారంలో ఉన్న టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోలేక పోయింది. నాయకులకు ఇచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రాలు ఆ పార్టీని నిలువునా పాతిపెట్టాయనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. దీంతో 2019 ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. పాలకొల్లు, ఉండిలో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ దూకుడు చూపించలేక పోయింది. ఇక, ఆ తర్వాత అయినా పార్టీ పుంజకుందా? ఇప్పటికి ఎన్నికలు ముగిసి 10మాసాలు పూర్తి అయినా. పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా ? అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఎక్కడికక్కడ నాయకులు 'మాకేమన్నా బాధ్యతలు అప్పగించారా? “ అని తప్పుకొంటున్నారు.
మూతి ముడుచుకుంటూ…
ఇక, మరికొందరు.. “మాకు బాధ్యతలు ఇచ్చారు కానీ, ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మా మాటలను పట్టించుకునేలా ఆదేశాలు ఇవ్వలేదు“- అని మూతిముడుచుకుంటున్నారు. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చాలనే డిమాండ్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, మరికొన్ని కోట్ల ఉన్న ఇంచార్జులు తమ పనితాము చూసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిన మాగంటి రూపాదేవి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పులపర్తి అంజిబాబు, కర్రా రాజారావు లాంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.
మునుపటి దూకుడేదీ?
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు వయోఃభారంతో గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండడం లేదు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బుజ్జి మృతి పార్టీకి తీరని లోటుగా మారింది. కొవ్వూరులో పార్టీని నడిపించే నాథుడు లేడు. ఇక్కడ ఎక్కువ మంది కేడర్ మాజీ మంత్రి జవహర్‌ను తిరువూరు నుంచి ఇక్కడికే తీసుకు రావాలని కోరుతోంది. తాడేపల్లిగూడెంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పార్టీకి దూరంగా వైసీపీకి దగ్గరగా ఉంటున్నారు. జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజులో మునుపటి దూకుడు లేదు. పార్టీ ఓడిన నియోజకవర్గాల పరంగా చూస్తే ఉంగుటూరు, తణుకు, దెందులూరు లాంటి చోట్లే పార్టీ కాస్త యాక్టివ్‌గా కనపడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు…..
ఈ పరిణామాల నేపథ్యంలో అసలు టీడీపీ ఈ జిల్లాలో పుంజుకుంటుందా ? మరికొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేతల మధ్య ఉన్న పొరపొచ్చాలను తొలగించి ప్రముఖంగా ప్రజల్లోకి వెళ్తుందా? లేక అసంతృప్తి రాజకీయాలతోనే కాలం వెళ్లదీస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. మరి చంద్రబాబు త్వరలోనే ప్రజాచైతన్య యాత్రలు చేపడుతున్నందున ఈ జిల్లాను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారని అందరూ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి .