మిగిలిన వారిలో భయం మొదలయిందా?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరింత డీలా పడేలా చేశాయి. దీంతో ఇరవై నెలల నుంచి అంతంత [more]

Update: 2021-03-30 03:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరింత డీలా పడేలా చేశాయి. దీంతో ఇరవై నెలల నుంచి అంతంత మాత్రంగానే ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు మరింత దూరమయ్యే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఏపీలో పెద్దగా ఉండకపోవడం, లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మధనం మొదలయింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

23 మంది గెలిచి…..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు మాత్రమే గెలిచారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. అయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల ఇలాకాలో పార్టీ ఘోరంగా దెబ్బతినింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

కొందరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఎన్నికలు లేకపోయినా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బాగా దెబ్బతీశాయి. అద్దంకి వంటి నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన చోట్ల ప్రజలు టీడీపీ వైపు చూడలేదు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల్లో భయం మొదలయిందంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలయింది.

ఆ నమ్మకం కూడా పోవడంతో…..

చంద్రబాబుపై సానుభూతి వస్తుందన్న ఆశ కూడా తిరుపతి ఘటనతో తేలిపోయింది. రాజధాని అమరావతి వ్యవహారం ఉత్తుత్తిదేనని ఫలితాలు తేల్చి చెప్పాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలలో టీడీపీ లో కొనసాగితే భవిష్యత్ ఉంటుందా? అన్న ఆందోళన ప్రారంభమయింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News