టీడీపీ నేతల సైలెంట్.. ఇంతలోనే ఏం జరిగింది…?
జగన్ సర్కారుపై నిన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు జగన్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు [more]
జగన్ సర్కారుపై నిన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు జగన్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు [more]
జగన్ సర్కారుపై నిన్నటి వరకు దూకుడు ప్రదర్శించిన టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు జగన్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని శాసన మండలిలో అడ్డుకున్న టీడీపీ నాయకులు.. నిజంగానే జగన్ ప్రభుత్వాన్ని ఒకింత గందరగోళంలోకి నెట్టారు. చివరకు టీడీపీ వాళ్ల హంగామా తట్టుకోలేక జగన్ చివరకు మండలి రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఆ హడావుడి ఇప్పుడు కనిపించడం లేదు. నిజానికి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నాయకులు పార్టీకి దూరమయ్యారు.
ఫైర్ బ్రాండ్స్ ఏరీ?
గెలిచినవారు, ఓడినవారు అనే వ్యత్యాసం లేకుండా.. తమకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకు న్నారు తమ్ముళ్లు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఏకంగా పార్టీలు మారి బీజేపీ కండువా, వైఎస్సార్ సీపీ కండువాలను కూడా కప్పుకొన్నారు. దీంతో బలమైన గళం వినిపించే నాయకులు టీడీపీలో తగ్గిపోయారనే చెప్పాలి. ఇక, మిగిలిన నాయకుల్లో పెద్దగా పార్టీ తరఫున వాయిస్ వినిపించే నాయకులు లేరనే అనాలి. ఉన్నవారేమో.. పార్టీ మారిపోగా.. గట్టిగా మాట్లాడి ఫైర్ బ్రాండ్స్ మాదిరిగా చక్రం తిప్పేవారు లేరనే చెప్పాలి.
మండలిలోనూ అంతే….
అయినప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి, సీఆర్‌డీఏ వంటివి రక్షించుకునేందుకు శాసన మండలిలో టీడీపీ సభ్యులు బలమైన శక్తిగానే వ్యవహరించారు. కానీ, ఇక్కడ కూడా కొందరు పోతుల సునీత, యామినీ బాల వంటి సభ్యులు వైఎస్సార్ సీపీ వైపు ఒరిగిపోయారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి బలమైన వాయిస్ ఉన్న నేతలు చివరకు పార్టీ మారి వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు అయ్యారు. ఎమ్మెల్సీలుగా ఉన్నవారిలో బుద్ధా వెంకన్న లాంటి వారు మినహా టీడీపీ తరఫున మాట్లాడేవారు కనిపించకుండా పోయారనే వాదన వినిపిస్తోంది. పార్టీ నుంచి మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ అవసరాల నేపథ్యంలో కండువా మార్చేందుకు రెడీగానే ఉన్నారన్న గుసగుసలు అయితే పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
తొలి ఏడాదిలోనే….
ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏంటి ? పార్టీ తరపున అటు మండలిలో, ఇటు బయట మీడియా ముందు గళం ఎవరు వినిపిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం చిక్కడం లేదు. ఇక అసెంబ్లీలో ఎలాగూ టీడీపీ తరపున వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలే పెద్దగా లేరు. పార్టీ నుంచి గెలిచిన వారిలో ముగ్గురు పార్టీకి దూరం కాగా మిగిలిన 20 మందిలో నలుగురైదుగురు మినహా మిగిలిన ఎమ్మెల్యేల నోట మాటే రాని పరిస్థితి. దీంతో అసెంబ్లీలో టీడీపీ నేతలు వైసీపీని ఎదుర్కొంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే, కొసమెరుపు ఏంటంటే.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య వంటివారు మాత్రమే ఒకింత మాట్లాడుతున్నారని చెప్పాలి. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చే సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కనిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ తరఫున వాయిస్ వినిపించేవారు తగ్గుతున్నారనే చెప్పాలి. ఎన్నికలు ముగిసిన తొలి యేడాదిలోనే ఈ పరిస్థితి ఉంటే మరో నాలుగేళ్లు చంద్రబాబు ఈ నేతల వాయిస్‌తో వైసీపీని ఎలా ? ఎదుర్కొంటారో ? చూడాలి.