జబ్బలు చరిచారుగా.. ఇక బరిలోకి దిగండి
ఎన్నికలు అంటే వైసీపీకి భయం అంటూ ఇంతకాలం తాపీగా ప్రచారం చేస్తూ నెట్టుకొచ్చిన టీడీపీకి అసలైన పంచాయతీ ముంగిట్లోనే ఉంది. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ ఘన [more]
ఎన్నికలు అంటే వైసీపీకి భయం అంటూ ఇంతకాలం తాపీగా ప్రచారం చేస్తూ నెట్టుకొచ్చిన టీడీపీకి అసలైన పంచాయతీ ముంగిట్లోనే ఉంది. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ ఘన [more]
ఎన్నికలు అంటే వైసీపీకి భయం అంటూ ఇంతకాలం తాపీగా ప్రచారం చేస్తూ నెట్టుకొచ్చిన టీడీపీకి అసలైన పంచాయతీ ముంగిట్లోనే ఉంది. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ ఘన విజయం ఖాయమని జబ్బలు చరచిన చంద్రబాబు ఆ దిశగా పార్టీని ముందుకు నడిపించవలసిన ఇపుడు అవసరం ఉంది. నిజానికి స్థానిక ఎన్నికల విషయంలో టీడీపీకి ఏ విధమైన హోప్స్ అయితే ఇప్పటిదాకా లేవు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి జగన్ కి పడదు అన్న ఒకే ఒక్క కారణం తో పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు తప్ప మరేమీ కాదు.
పవర్ తోనే పవర్….?
ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీకే లోకల్ బాడీ ఎన్నికల్లో దూసుకుపోయే అవకాశం ఉంటుంది అన్నది నిజం. ఎమ్మెల్యేలు, ఎంపీలే గోడ దాటేస్తున్న వేళ విపక్షం నుంచి స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు, ప్రతినిధులు ఒక వేళ ఉన్నా వారు ఆ పార్టీకే కట్టుబడి ఉంటారని నమ్మకం కూడా లేదు. ఇక పై స్థాయిలో ఎన్నికల సంఘం ఉన్నా ఎన్నికలను నడిపించాల్సింది అంతా అధికారంలో ఉన్న ప్రభుత్వం దాని యంత్రాంగమే. వీటికి తోడు వైసీపీకి కచ్చితంగా మరో మూడేళ్ళు పైగా అధికారం ఉందని జనాలకూ తెలుసు. అందువల్ల పై స్థాయిలో ప్రభుత్వం ఏది ఉంటే దానికే ఓటు వేసి తమ ఊరుని, ప్రాంతాన్ని కాస్తా అభివృద్ధి చేసుకోవాలనుకోవడం కూడా కద్దు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అన్ని విధాలుగా వైసీపీకే ఎడ్జ్ ఉండే ఎన్నికలు ఇవి.
ఇగో బ్యాటిల్ తప్ప….?
ఇప్పటిదాకా జరిగిన పంచాయతీ అంతా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇగో బ్యాటిల్ గానే చూడాలి. అంతకు మించి దీనికి ఏమీ ప్రాధాన్యత లేదు. ఇక స్థానిక ఎన్నికలలో జనంలోనే ఎవరైనా చూసుకోవాలి, తేల్చుకోవాలి. అందువల్ల అసలైన బలం ఎవరికి ఉంటే అది అక్కడ రుజువు అవుతుంది. అయితే ఈ ఇరవై నెలల్లో ఏమైనా మార్పు వచ్చిందా అన్నదే చూడాలి. ఏ మార్పు వచ్చినా దారుణమైన ఫలితాలు అయితే స్థానిక ఎన్నికల్లో రావు. అధికార పార్టీకి ముచ్చేమటలు పట్టించేలా, టీడీపీకి పెద్ద ముచ్చట తీర్చేలా రిజల్ట్ మాత్రం ఉండదు అన్నది ఒక కచ్చితమైన విశ్లేషణ. దాంతో టీడీపీ యుద్ధానికి గట్టిగానే రెడీ కావాల్సిందే. 2019 నాటి ఘోర పరాభవాన్ని కాస్తా అయినా మరచిపోయేలా ఫలితాలు తెచ్చుకోవాల్సిందే.
కార్నర్ అవుతారా…?
ఇపుడు వైసీపీ దెబ్బ తిన్న పులిలా ఉంది. గత ఏడాది అయితే మామూలుగా పోరు సాగేది. ఇపుడు ఇంత రచ్చ జరిగాక ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ అసలు వదలదు. పైగా పవర్ లో ఉన్న పార్టీ, ఇక జగన్ దూకుడు, వైసీపీ జోరు చూసిన వారు కచ్చితంగా టీడీపీని కార్నర్ చేస్తారనే అంటారు. టీడీపీకి మళ్ళీ లేవకుండా చావు దెబ్బ కొట్టేలా వైసీపీ స్థానిక పోరులో వ్యూహాలు రచిస్తుందని కూడా చెప్పాలి. మొత్తానికి చూస్తే కనుక ఈ ఎన్నికలు నిజమైన అగ్ని పరీక్ష టీడీపీకే అని చెప్పాలి. దిగాలుగా ఉన్న క్యాడర్ ని సమరానికి తరలించి టీడీపీకి మెరుగైన ఫలితాలు సాధించకపోతే చంద్రబాబుకే కాదు ఆయన పార్టీకి ఇబ్బందే మరి. అందుకే ఇజ్జత్ మే సవాల్ గా ఈ ఎన్నికలను చెప్పాలి.