టీడీపీలో వితండవాదం.. బాబు స్కెచ్ అమలు చేస్తున్న జగన్
వైసీపీకి, టీడీపీకి మధ్య ఉన్న వివాదాలు, విభేదాలు అందరికీ తెలిసిందే. ఏ పక్షం నాయకులు నోరు విప్పినా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ [more]
వైసీపీకి, టీడీపీకి మధ్య ఉన్న వివాదాలు, విభేదాలు అందరికీ తెలిసిందే. ఏ పక్షం నాయకులు నోరు విప్పినా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ [more]
వైసీపీకి, టీడీపీకి మధ్య ఉన్న వివాదాలు, విభేదాలు అందరికీ తెలిసిందే. ఏ పక్షం నాయకులు నోరు విప్పినా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావొచ్చు లేదా.. ఇతర విషయాలు కావొచ్చు.. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కామన్. అయితే.. ఇప్పుడు ఈ క్రమంలోనే టీడీపీలో ఒక వితండ వాదం తెరమీదికి వచ్చింది. అదేంటంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్యూహం లేదని.. తాము చేస్తున్న డిమాండ్లనే.. కొద్ది రోజుల తేడాతో అమలు చేస్తున్నారని.. అంటున్నారు.
బాబు సూచనల మేరకే?
దీనికి టీడీపీ నేతలు రెండు ఉదాహరణలు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసి.. తన పబ్బం గడుపుకొందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగిపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు కీలక సలహా ఇచ్చారని.. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సూచించారని అంటున్నారు. అయితే.. రాష్ట్ర సర్కారు మాత్రం ఈ విషయంలో మొండిగానే వ్యవహరించినా.. తర్వాత తర్వాత టీడీపీ అధినేత చెప్పినట్టే చేశారని అంటున్నారు.
లోకేష్ డిమాండ్ తోనే..?
ఇక, నారా లోకేష్ విషయంలోనూ ఇలానే జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం జోరుగా నిర్ణయం తీసుకుందని.. ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని స్పష్టం చేసిందని.. అయితే.. లోకేష్ మాత్రం పరీక్షల కారణంగా.. రాష్ట్రంలో కరోనా తీవ్రత మరింత పెరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారని.. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసి.. ప్రభుత్వానికి నివేదించారని.. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.
పరీక్షలు వాయిదా..?
అయితే.. ఇప్పుడు మాత్రం తాజాగా పరీక్షలు వాయిదా వేస్తూ.. తీసుకున్న నిర్ణయం కేవలం.. లోకేష్ డిమాండేనని చెబుతున్నారు. మొత్తంగా ఈ రెండే కాకుండా.. ప్రభుత్వ వైద్యశాలలో పడకల పెంపు కూడా ఈ కోవలేదని అంటున్నారు. అంటే.. టీడీపీ బాటలోనే వైసీపీ నడుస్తోందనే వాదనకు బలం చూకూరుతోందని అంటున్నారు.