ముగ్గురూ ఉన్నా లేనట్లేనా? వీరిలో ఆయన ఒక్కరేనా?

గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ముగ్గురు ఎంపీల్లో ఎవ‌రు హీరో.. ఎవ‌రు జీరో.. అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి [more]

Update: 2020-05-25 11:00 GMT

గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ముగ్గురు ఎంపీల్లో ఎవ‌రు హీరో.. ఎవ‌రు జీరో.. అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్రధాన కార‌ణం.. ఎంపీలుగా ఎన్నికై.. ఏడాది పూర్తి యింది క‌నుక‌. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో అనేక కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వ‌చ్చాక‌.. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ స‌హా.. పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియం ర‌ద్దు.. వంటి కీల‌క నిర్ణయాల‌పై దూసుకుపోయింది. వీటి విష‌యంలో టీడీపీ ఎంపీలు స్పందించినా.. సాధించిన విజ‌యం మాత్రం స్వ ల్పంగానే ఉంది. అందులోనూ వ్యక్తిగ‌తంగా తీసుకుంటే.. ఒక్కరు త‌ప్ప మిగిలిన ఇద్దరూ కూడా సాధిం చింది ఏమీలేదు.. హ‌డావుడి త‌ప్ప అనే మాట వినిపిస్తుంది.

ముగ్గురు ఎంపీల్లో…..

రాజ‌ధాని విష‌యంలో ఒక ఎంపీ తీవ్రంగా స్పందిస్తే.. మ‌రో ఎంపీ త‌ట‌స్థంగా ఉండ‌గా.. ఇంకో ఎంపీ ఫుల్ మౌనం పాటించారు. దీంతో ఏడాది పూర్తయిన నేప‌థ్యంలో టీడీపీ ఎంపీల వైఖ‌రిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగు తోంది. విజ‌య‌వాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌, శ్రీకాకుళం నుంచి రామ్మోహ న్ ‌నాయుడు విజ‌యం సాధించారు. గ‌త 2014లోనూ వీరు విజ‌యం సాధించ‌డం, వ‌రుస‌గా గెలుపు గుర్రం ఎక్కడం గ‌మ‌నార్హం. అయితే, గ‌త ఐదేళ్ల కాలానికి భిన్నంగా ఇప్పుడు గ‌డిచిన ఏడాది కేవ‌లం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువ‌చ్చిన అనేక‌ సంస్కర‌ణ‌ల‌పైనే వీరు దృష్టి పెట్టాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో పార్టీలో అంత‌ర్గత కుమ్ములాట‌ల వ్యవ‌హారంతో విజ‌య‌వాడ ఎంపీ చాన్నాళ్ల పాటు పార్టీని టార్గెట్ చేశారు.

వీరికి ప్లస్ అదే….

అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ల‌తోనూ భేటీ అయ్యారు. దీంతో స‌ద‌రు ఎంపీ వ్యవ‌హారం.. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని.. ఇప్పటికీ నియో‌జ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్యల‌పై కంటే .. ప్రభుత్వాన్ని విమర్శించ‌డంపైనే ఎక్కువ‌గా దృస్టి పెడుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల‌ను ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు ప‌ట్టించుకున్నది కూడాలేద‌ని విమ‌ర్శలు వున్నాయి. అయితే ఎప్పుడూ ఏదోలా ప్రజ‌ల్లో ఉండ‌డం ఆయ‌న‌కు ప్లస్‌. ఇక‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా విష‌యానికి వ‌స్తే.. రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంపై చాలా ఆల‌స్యంగా స్పందించారు. అయితే, త‌ర్వాత మాత్రం ఆయ‌న హ‌డావుడి చేయ‌డం, అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమాలు చేప‌ట్టడం, అరెస్టు కావ‌డం వంటివి గ‌ల్లాను హైలెట్ చేశాయి.

రామ్మోహన్ మాత్రం…..

అదే స‌మ‌యంలో తెలుగు మాధ్యమంపై గ‌ల్లా జ‌య‌దేవ్ పార్లమెంటులో ఇంగ్లీ షులో మాట్లాడ‌డం వ్యక్తిగతంగా విమ‌ర్శల‌పాలు చేసింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అందుబాటులో లేర‌నే అప‌ప్రధను మూట గ‌ట్టుకున్నారు. మా ఎంపీ అడ్రస్ ఎక్కడ ? అని తెలుగు త‌మ్ముళ్లే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మొత్తాంగా చూస్తే.. గ‌ల్లా గ‌త ఐదేళ్లతో పోల్చుకుంటే.. కేవ‌లం హ‌డావుడికే ప్రాధాన్యం ఇచ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఎక్కడ ఎలా వ్యవ‌హ‌రించాలో.. అలా వ్యవ‌హ‌రించి ప్రజ‌ల్లోను, పార్టీలోనూ మంచి మార్కులు తెచ్చుకున్నారు. తెలుగు విష‌యం వ‌చ్చిన‌ప్పుడు పార్లమెంటులో గ‌ట్టి వాయిస్ వినిపించారు.

రాజధాని విషయంలో….

రాజ‌ధాని విష‌యం వ‌చ్చిన‌ప్పుడు విశాఖ‌కు రాజ‌ధాని రావ‌డం వ‌ల్ల శ్రీకాకుళానికి మేలు జ‌రుగుతుంద‌ని గ్రహించినా.. పార్టీ లైన్ ప్రకారం ఆయ‌న మౌనం వ‌హించారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేదు. స్థానికంగా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌నే పేరు తెచ్చుకున్నారు. దీంతో టీడీపీ ఎంపీల్లో రామ్మోహ‌న్ యువ‌కుడే అయినా బాధ్యత‌గా వ్యవ‌హ‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. అయితే అదే టైంలో విశాఖ రాజ‌ధాని ప్రక‌ట‌న విష‌యంలో ఆయ‌న పార్టీ లైన్ దాట‌లేక మౌనంగా ఉండాల్సి రావంతో ప్రజ‌ల నుంచి కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నారు. మొత్తానికి వీరి వ్యవ‌హారాన్ని బ‌ట్టి హీరోలెవ‌రో ? జీరోలెవ‌రో ? అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News