సీనియర్ నేతలను ఒణికిస్తున్న “సన్సే”షన్ ఇష్యూ.. ఏపీలో హాట్ టాపిక్
ఏపీలో సీనియర్ రాజకీయ నేతలను ఓ విషయం వణికిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకు లు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ [more]
ఏపీలో సీనియర్ రాజకీయ నేతలను ఓ విషయం వణికిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకు లు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ [more]
ఏపీలో సీనియర్ రాజకీయ నేతలను ఓ విషయం వణికిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకు లు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. విషయం ఏంటంటే.. రాజకీయాలు కూడా వ్యాపారం మాదిరిగానే మారిపోయాయి. వారసుల కోసం వ్యాపారులు చేస్తు న్న రీతిలోనే నేతలు కూడా తమ రాజకీయాల కోసం వారసులను వెతుక్కుంటున్నారు. అయితే, ఈ విష యంలో కొందరు సక్సెస్ అవుతుంటే.. చాలా మంది విఫలమయ్యారు. చంద్రబాబు-వైఎస్ ఒకే తరహా రాజకీయాలు చేసి.. ఒకే పార్టీ నుంచి వచ్చినా.. వారసుల విషయానికి వచ్చే సరికి చాలా వ్యత్యాసం ఉంది.
వారసుల కోసం….
చంద్రబాబు వారసుడు క్లిక్ కాలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనను బలవంతంగా తెచ్చి.. రుద్దుతున్నారనే విమర్శలుకూడా పార్టీలోని కొందరు యువ నాయకులు వంశీ వంటి వారు కొన్నాళ్ల కిందట తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇక, వైఎస్ కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలో ఏ వారసుడు కూడా సక్సెస్ కాని రీతిలో విజయం అందుకుని ఏకంగా సీఎం అయ్యారు. మరి ఇలా తమ వారసులను కూడా మంచి పొలిటికల్ రేంజ్‌లో చూడాలనే నాయకులు ఎక్కువ మందే ఉన్నారు.కానీ, వారు వేసుకుం టున్న అంచనాలు.. క్షేత్రస్థాయిలో వస్తున్న ఫలితాలు మాత్రం తేడా కొడుతున్నాయి.
గెలుపు గుర్రం ఎక్కలేక….
దీంతో సదరు యువ నాయకులు త్రిశంకు స్వర్గంలో ఊయలలాడుతున్నారు. వీరిలో కీలకమైన యువ నాయక పరంపరం అంతా సీమ జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. చిత్తూరులో తీసుకుంటే.. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు.. సుధీర్ రెడ్డి, ఇదే జిల్లాలో మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ, ఇదే జిల్లాలో దివంగత గాలి ముద్దుకృష్ణమ కుమారుడు భాను ప్రకాశ్ నాయుడు, ప్రకాశంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్దా సుధీర్ బాబు.. వంటి వారిలో గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసిన వారు కొందరు ఉన్నారు. అయితే, వీరు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక, కొందరికి టికెట్లు కూడా లభించలేదు.
బెడిసి కొట్టడంతో….
అదేవిధంగా అనంతపురం జిల్లాలో జేసీ తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి, పరిటాల వారసుడు శ్రీరాంల వ్యూహాలు కూడా గత ఏడాది ఎన్నికల్లో బెడిసి కొట్టాయి. తమకు తిరుగులేదని చెప్పు కొనే నాయకులు తిరుగు టపాలో ఇంటికే పరిమితమయ్యారు. అదేసమయంలో కడపలోనూ వారసుల రాజకీయ కేకలు ఎక్కువగానే ఉన్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కుమారుడు చదిపిరాళ్ల సుధీర్‌రెడ్డి కూడా రాజకీయంగా ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు మాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నారు.
అడ్రస్ లేకుండా పోయారే..
అదేవిధంగా కర్నూలులో టీజీ వెంకటేష్ వారసుడు టీజీ భరత్ పరిస్తితి కూడా రెండడుగులు ముందుకు పదడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఇక, మాజీ స్పీకర్, శ్రీకాకుళానికి చెందిన ప్రతిభా భారతి వారసురాలు.. గ్రీష్మ పరిస్థితి కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్న విధంగా ఉంది. పలాస నుంచి పోటీ చేసి ఓడిన మాజీ టీడీపీ నాయకుడు గౌతు శివాజీ కుమర్తె గౌతు శిరీష పరిస్థితి కూడా ఏమీ అర్ధం కావడం లేదు. ఈమె గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు పుంజుకు నే రేంజ్‌లో రాజకీయాలు చేయలేక పోతున్నారు. అదేసమయంలో రాజమండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ వారసురాలిగా రంగంలోకి దిగిన ఆయన కోడలు మాగంటి రూపాదేవి అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు.
ఫ్యూచర్ అర్థం కాక…
ఆమె కూడా గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితికూడా రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. అటు దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్ హరీష్ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఐటీ ఉద్యోగం వదులుకుని వచ్చిన హరీష్ ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో చాలా మంది వారసులు తమ ఫ్యూచర్ లేక ఇబ్బంది పడుతుంటే.. వీరి గురించి వారి తండ్రులు, తల్లులు తీవ్రమైనబెంగతో చలీ జ్వరం వచ్చినట్టు ఫీలవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు వైసీపీ దూకుడు, మరోవైపు.. చంద్రబాబు వ్యూహాలు విఫలమవుతుండడంతో తమ వారసుల పరిస్థితిని తలుచుకుని కుమిలిపోతున్నారని అంటున్నారు.