విఫల ప్రయోగమేనా…?
రాజకీయాల్లో సక్సెస్ అనేది కొందరికే సొంతమవుతుందా? వారసులుగా వచ్చిన వారంతా సక్సెస్ అవుతా రనే గ్యారెంటీ ఏమీ లేదా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అనాల్సి [more]
రాజకీయాల్లో సక్సెస్ అనేది కొందరికే సొంతమవుతుందా? వారసులుగా వచ్చిన వారంతా సక్సెస్ అవుతా రనే గ్యారెంటీ ఏమీ లేదా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అనాల్సి [more]
రాజకీయాల్లో సక్సెస్ అనేది కొందరికే సొంతమవుతుందా? వారసులుగా వచ్చిన వారంతా సక్సెస్ అవుతా రనే గ్యారెంటీ ఏమీ లేదా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అనాల్సి వస్తోంది. ఇటు అధికార పార్టీ వైసీపీలోనూ అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ ఈ తరహా సక్సెస్ మంత్రంపై తీవ్ర చర్చ సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకులు లేదా రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు వివిధ కారణాలతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నారు. అయితే, ఎంత గుడ్‌బై చెప్పినా.. రాజకీయాలు రాజకీయాలే. వీటిలో ఉన్న మజా అంతా ఇంతా కాదు కదా..?
వారసులను రంగంలోకి దింపి…..
అందుకే, వీరంతా కూడా తాము రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ.. టీడీపీ నేతలు తమ వారసులను రంగంలోకి దింపాలని తెగ ప్రయాస పడుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఈ తరహా ప్రయత్నాలు కూడా కనిపించాయి. అయితే, వీరిలో సక్సెస్ అయినవారు అంటూ పెద్దగా కనిపించక పోవడం ఇప్పుడు మారుతున్న ప్రజల అభిరుచులకు మాదిరిగానే మారుతున్న రాజకీయాలకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇదే తరహా పరిస్తితిని రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి.. వృద్ధులు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు చేయలేనని చెప్పేశారు. దీంతో ఆయన కుమారుడు కె. శ్యాంబాబును రంగంలోకి దింపారు.
అధికారంలో ఉండగా….
కానీ, విజయం సాధించలేదు. సరే.. జయాపజయాలు సాధారణే అనుకున్నా.. నిలదొక్కుకోవడంలోనూ కేఈ శ్యాంబాబు విఫలమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పత్తికొండలో ఎక్కడా కనపడడం లేదు. పైగా 40 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడం కూడా శ్యాంబాబును ప్రజలు ఏ మాత్రం ఆదరించే పరిస్థితి లేదని స్పష్టమైంది. అదే సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణ కుమారుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డిపై నెల్లూరు జిల్లాకు చెందిన బియ్యపు మధుసూదన్‌రెడ్డి గెలిచారు. ఈ ఇద్దరు వారసుల ఓటమికి తండ్రులు అధికారంలో ఉండగా చేసిన దందుడుకు పనులే అన్నది ఆ నియోజకవర్గాల ప్రజలు చెప్పేమాట.
విఫమవ్వడంతో….
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ టీడీపీ నేత జలీల్ ఖాన్ పరిస్థితి ఇలానే ఉంది. అదేవిధంగా పరిటాల పుత్రరత్నం శ్రీరామ్ కూడా అట్టహాసంగా గెలుపు కోసం ప్రయత్నించారు. సరే విజయం వరించలేదు. కానీ, భవితవ్యంపై భరోసా ఉందా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది. అలాగే, జేసీ కుమారులు ఇద్దరూ కూడా విఫలమయ్యారు. జేపీ పవన్, జేసీ అశ్మిత్ ఓటమితో చివరికి జేసీ ఫ్యామిలీ పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఇక, అశోక్ జగపతిరాజు, కిశోర్ చంద్రదేవ్‌లు తాము పోటీ లో ఉంటేనే తమ కుమార్తెలకు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అయినా విఫలమయ్యారు.
తండ్రులనే నమ్ముకుని…..
భూమా కుటుంబం నుంచి వచ్చిన అఖిల ప్రియ కూడా తండ్రి ఉండగా సాధించిన విజయం తాలూకు ప్రభావాన్ని అందిపుచ్చుకోలేక పోయారు. అంతేకాదు, పట్టుమని ఓ పాతిక మందిని వెంట తిప్పుకోలేని దైన్యంలో ఉన్నారు. టీజీ వెంకటేశ్ తనయుడు కూడా ఇదే బాటలో ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన వారసత్వాన్ని సోదరుడుకి అప్పించినా.. ఆయన కూడా పుంజుకోలేదు. పైగా నెగిటివ్ ఇంపాక్ట్ కొనితెచ్చుకున్నారు. గౌతు ఫ్యామిలీ నుంచి వచ్చిన శిరీషకు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ప్రజామోదమే లభించడం లేదు. దీంతో ఆమె కూడా మౌనంగానే ఉంటున్నారు.ఇక, ఇంకా ప్రధానమైన విషయం మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ పుంజుకుంటారా? మంగళగిరిలో గెలుపు గుర్రం ఎక్కుతారా? ఇవన్నీ.. మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ముందు నేతలుగా వృద్ధి చెందకుండా.. పార్టీ పరంగా వీరు గుర్తింపు కోరుకోవడంలోనే అంతా ఉందని అంటున్నారు విశ్లేషకులు. పార్టీలను పట్టుకుని వేలాడకుండా.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటే.. అదే వీరికి రాజకీయంగా పునాదులు వేస్తుందనేది కీలక సూత్రం. మరి ఏంజరుగుతుందో చూడాలి.