అవమానాలు భరించలేకనే?
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసైడ్ అయిపోయారన్నది తేలిపోయింది. అయితే మండలి రద్దుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి మమ [more]
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసైడ్ అయిపోయారన్నది తేలిపోయింది. అయితే మండలి రద్దుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి మమ [more]
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసైడ్ అయిపోయారన్నది తేలిపోయింది. అయితే మండలి రద్దుపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి మమ అనిపించేయనున్నారు. అయితే సోమవారం అసెంబ్లీకి టిడిపి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని టిడిఎల్పీ డిసైడ్ అయిపొయింది. అసెంబ్లీలో మండలి రద్దుకు సంబంధించి జరిగే చర్చలో పాల్గొంటే అడుగడుగునా అవమానాలు ఎదుర్కొవాలిసి వస్తుందని ఊహించి సమావేశానికి డుమ్మా కొట్టడమే మంచిదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికార వైసీపీ తెలుగుదేశాన్ని అసెంబ్లీలో బంతి ఆట ఆడేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో పోయి పోయి వేడివేడిగా వున్న రాజకీయ వాతావరణంలో సంఖ్యా పరంగా అతి తక్కువమంది ఉన్నందున చర్చలో పాల్గొనడం నష్టమేనన్నది టిడిపి అంచనాగా చెబుతున్నారు.
ఎన్టీఆర్ నిర్ణయంపై …?
ఎన్టీఆర్ గతంలో శాసన మండలిని రద్దు చేసి పారేశారు. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీని కాదని విపక్షాలకు మెజారిటీ వున్న మండలిలో బిల్లులను రాజకీయంగా అడ్డుకోవడాన్ని జగన్ తరహాలోనే ఎన్టీఆర్ సహించలేకపోయారు. ప్రజాధనం వృధా కావడం తప్ప మండలి లో మేధో చర్చలు లేనేలేవనే ఎన్టీఆర్ ఆ విధంగా నిర్ణయం తీసేసుకున్నారు. చర్చలో టిడిపి ఇప్పుడు పాల్గొంటే నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాలిసి వుంది. తమ పార్టీ చేస్తే రైట్ మరో పార్టీ చేస్తే తప్పు అని టిడిపి వాదన చేస్తే జనంలో చులకన కావడం ఖాయం. ఇది గమనించే మండలి రద్దు నిర్ణయం కోసం జరిగే శాసనసభ చర్చలో పాల్గొనకపోవడం ఉత్తమం అని పసుపు పార్టీ లెక్కేసింది. ఇప్పుడు జగన్ సైతం మూడు రాజధానుల బిల్లులపై ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఆయన ఎన్టీఆర్ తరహాలోనే ఆలోచించి దీని రద్దు చేయడమే సర్వోత్తమం అని నిర్ణయించేసుకున్నారు. దాంతో అనుకోని పరిణామాలు సంభవిస్తే తప్ప మండలి రద్దు ఖాయమని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టం అయిపొయింది.
వైఎస్ ఎందుకు ఏర్పాటు చేశారంటే …?
వైఎస్ బాటలో ప్రయాణం చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ దానికి భిన్నంగా వెళుతుందని టిడిపి ప్రచారం మొదలు పెట్టింది. రాజశేఖర రెడ్డి మండలిని ఏర్పాటు చేస్తే ఆయన కుమారుడు రద్దు చేస్తున్నారంటూ తెలుగుదేశం సాగిస్తున్న ప్రచారాన్ని వైసిపి సమర్ధంగా తిప్పికొట్టే పని లో ఇప్పుడు పడింది. వైఎస్ కు నాడు అధిష్టానం కాంగ్రెస్ గా ఉండేదని ఆయనకు ఇష్టం వున్నా లేకపోయినా పార్టీ చెప్పిన పనులు చేయాలిసి వచ్చిందని కౌంటర్ ఇస్తుంది. జగన్ కి ఇప్పుడు ఆ గత్యంతరం లేదని పార్టీకి ఆయనే సుప్రీం కాబట్టి ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా దొడ్డి దారిని మూసేసేందుకే ధైర్యంగా నిర్ణయం తీసుకోబోతున్నారంటూ చెప్పుకొస్తుంది.