సీమలో సైకిల్ రన్నింగ్ స్లో అయినట్లేనా?

ఏ పార్టీకైనా కొన్ని ప్రాంతాల్లో ప‌క్కా మెజారిటీ ఉంటుంది. ఇక‌, జిల్లాల జోలికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌నే యంత్రాంగం.. ప‌టిష్ట మేండేట్‌, గ‌ట్టి ఓటు బ్యాంకు ఉంటాయి. [more]

Update: 2020-04-11 15:30 GMT

ఏ పార్టీకైనా కొన్ని ప్రాంతాల్లో ప‌క్కా మెజారిటీ ఉంటుంది. ఇక‌, జిల్లాల జోలికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌నే యంత్రాంగం.. ప‌టిష్ట మేండేట్‌, గ‌ట్టి ఓటు బ్యాంకు ఉంటాయి. అదే స‌మ‌యంలో పార్టీ అధినేత‌లకు కూడా వారి వారి సొంత జిల్లాలు, సొంత ప్రాంతాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌ట్టు ఉంటుంది. ఉండాల‌ని కూడా నాయ‌కులు కోరుకుంటారు. కానీ, అదేం చిత్రమో.. టీడీపీ అధినేత చంద్రబాబు విష‌యంలో మాత్రం ఇది బెడిసి కొడుతోంది. ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులోను, ఆయ‌న ప్రాంతం సీమ జిల్లాల్లోనూ కూడా టీడీపీ హ‌వా ముందుకు సాగ‌డం లేదు. ఇక్కడ ఫ‌ర్వాలేదు.. ఇంక కంటిపై కునుకు ప‌డుతుంది. అనుకునే ప‌రిస్థితి బాబుకు కానీ, పార్టీ నాయ‌కుల‌కు కానీ క‌నిపించ‌డం లేదు.

మూడు చోట్ల మాత్రమే….

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీమ‌లో ఉన్న 52 జిల్లాల్లో టీడీపీ కేవ‌లం మూడు చోట్ల మాత్రమే విజ‌యం సాధించింది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ, ఉర‌వ‌కొండ నుంచి ప‌య్యావుల కేశ‌వ్ నుంచి గెలిచారు. ఇక ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌ర్వంలో సైతం చాలా చోట్ల టీడీపీ నామినేష‌న్లు వేసే ప‌రిస్థితి కూడా లేదు. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇది చంద్రబాబుకు సొంత జిల్లా. ఆయ‌న ఫార్టీ ఇయ‌ర్స్‌గా రాజ‌కీయాలు చేస్తున్నది కూడా ఈ జిల్లా నుంచే అయినా కూడా ఆయ‌న ప‌ట్టు సాధించ‌లేక పోయారు. అంతేకాదు, ఆయ‌న పుట్టిన ఊరు చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ హ‌వా క‌నిపించ‌డం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి టీడీపీ చంద్రగిరిలో గెలవకపోవడం గమనార్హం.

ఎన్నికలు జరగకుండానే?

ఇక‌, కుప్పంలోనే టీడీపీ అష్టక‌ష్టాలు ప‌డుతోంది. అస‌లు చిత్తూరు జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ముందుండి న‌డిపించే బ‌ల‌మైన నేత‌లే లేరు. ఇది చంద్రబాబుకు చాలా ఇబ్బందిక‌ర అంశంమే అని చెప్పాలి. ఇక‌, మిగిలిన సీమ జిల్లాల్లోనూ కీల‌క‌మైన అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగానే ఉంది. ఇక్కడ కూడా పార్టీ ఇబ్బందులు ప‌డుతోంది. ఇక సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే జ‌డ్పీ పీఠం వైసీపీ ఖాతాలో ప‌డింది. క‌డ‌ప‌లో ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల‌కు పార్టీని వ‌దిలేసి కాడి కింద‌ప‌డేశారు.

ఇక్కడ జీరో పెర్ ఫార్మెన్స్ అయినా….

ఇక‌, క‌ర్నూలులోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి వెంటాడింది. 14 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా టీడీపీ గెల‌వ‌లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో నాలుగు జిల్లాల్లోనూ పార్టీని ముందుండి న‌డిపించేందుకుకానీ, పార్టీని పునః కోలుకునేలా చేయ‌డంలోను కానీ చంద్ర‌బాబు ఎలాంటి వ్యూహంతోనూ ముందుకు సాగ‌డం లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. అసలు సీమ‌లో పార్టీ ప‌టిష్టత‌పై ఆయ‌న దృష్టిపెట్టిన‌ట్టు లేదు.

ఎప్పుడూ ఆ జిల్లాల మాటే….

చంద్రబాబు నోట ఎప్పుడూ కృష్ణా, గుంటూరు జిల్లాలో లేదా గోదావ‌రినో లేదా ఉత్తరాంధ్ర గురించే స‌మీక్షలు , స‌మావేశాలు పెడుతున్నారే త‌ప్పా సీమ‌ను గాలికి వ‌దిలేశారు. ఏదేమైనా ఒక అనుభవం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. కానీ, చంద్రబాబు మాత్రం ఈ నాలుగు జిల్లాల్లో ఎన్నిక‌లు ముగిసి ప‌ది మాసాలు పూర్తయినా.. ఇప్పటి వ‌ర‌కు కూడా ఎలాంటి వ్యూహం సిద్ధం చేసుకోకుండానే ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక్కడ అస‌లు టీడీపీ కాడి ప‌డేసిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News