ఇద్దరికీ టైటేనటగా

ఏపీలో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం ఏదో ఊపు మీద దక్కిందన్న విమర్శ ఉంది. టీడీపీ అయితే ఈవీఎంల సహాయం అంటూ లేని [more]

Update: 2019-07-29 14:30 GMT

ఏపీలో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం ఏదో ఊపు మీద దక్కిందన్న విమర్శ ఉంది. టీడీపీ అయితే ఈవీఎంల సహాయం అంటూ లేని పోని అనుమానాలు పెంచుతూ పోయింది. అయితే ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా ప్రీ పోల్ సర్వేల నుంచి ఏ దశలోనూ వైసీపీ వెనక్కి తగ్గలేదు. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించింది. మరో వైపు టీడీపీ అప్పటికే బాగా వెనకబడిపోయింది. జగన్ కి ఓ చాన్స్ ఇద్దామన్న వారి గొంతు పెరిగి పెద్దదై అది సునామీగా మారేసరికి టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది. మరి ఆ సునామీ లాంటి జనాభిమానాన్ని వైసీపీ నిలబెట్టుకుందా లేదా అన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది. జగన్ విషయానికి వస్తే ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరుకు జనం నూటికి నూరు మార్కులు వేశారు. మరి ముఖ్యమంత్రిగా ఆయన తొలి అడుగులు, విధానాలు ఎలా ఉన్నాయన్న దాని మీద జనం తీర్పు ఇచ్చేది కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. అందువల్ల స్థానిక ఎన్నికలు ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

టీడీపీకి పెను సవాల్….

ఇక పార్టీ పుట్టినది లగాయితు ఇంతటి ఘోరమైన అవమానం టీడీపీకి జరగలేదు. చంద్రబాబుకు ఓటమి కొత్తకాదు, కానీ వైసీపీ చేతిలో ఈ రకమైన దారుణ పరాజయం మాత్రం కచ్చితంగా కొత్తే. అందుకే ఆయన తేరుకోలేకపోతున్నారు అయినా రాజకీయాల్లో పండిపోయిన అనుభవం ఉంది కాబట్టి తనదైన చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీడీపీ చూపు ఇపుడు స్థానిక ఎన్నికల పైనే ఉంది. అక్కడ నుంచి నరుక్కు రావాలని ఆ పార్టీ డిసైడ్ అయిపోయింది. అందుకే జగన్ ఇలా సీఎం గా ప్రమాణం చేయగానే అలా విమర్శలతో దాడి చేయడం మొదలెట్టింది. హామీలను జగన్ తుంగలోకి తొక్కుతున్నాడన్న ఆరోపణలన్నీ స్థానికి సమరంలో వాడుకునే ఆయుధాలే. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కోలుకుంటే పార్టీ పటిష్టంగా ఉన్నట్లుగా సందేశం ఇటు తమ్ముళ్ళకు, అటు జనాలకు కూడా వెళ్తుంది. అది 2024 ఎన్నికల్లో గెలవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల స్థానిక ఎన్నికలు టీడీపీకి పెను సవాల్ లాంటివి.

ఒంటరి పోరాటమట….

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేని సంప్రదాయాన్ని అనుసరించి దెబ్బతిన్నారు. ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు రాజకీయాలతో 2014 టైమ్ లో గడిపేశారు. నిజానికి తొలి సారి పార్టీ పెట్టిన తరువాత జనంలో వచ్చే అతి పెద్ద ప్రభావాన్ని తనకు తానుగా పవన్ కోల్పోయాడు. ఆ విధంగా అయన తన తప్పు లేకపోయినా టీడీపీ, బీజేపీ విధానలను వ్యతిరేకించేవారికి టార్గెట్ అయ్యాడు. ఇక 2019 నాటికి విడిగా పోటీకి దిగుతూ పెద్దగా బలం లేని వామపక్షాలను, అసలు ఏపీలో ఉనికి లేని బీఎస్పీని కలుపుకుని వెళ్ళడం ద్వారా మరో తప్పు చేశాడు. దాంతో ఆయన పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఇపుడు పవన్ అసలైన దారిలోకి వచ్చాడు. ఏదైనా ఒంటరిగా, సొంతంగా తేల్చుకోవాలనుకుంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అసలు బలమేంటో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవచ్చునన్నది పవన్ ఆలోచనగా ఉంది. మొత్తానికి ఏపీలో ప్రధాన పార్టీలైన జనసేన. టీడీపీలకు స్థానిక ఎన్నికలు చాలా కీలకమైనవి. అతి ముఖ్యమైనవి. ఇక ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఆసక్తిని కలిగించనున్నాయి.

Tags:    

Similar News