జగన్ కు రహస్య మిత్రుడిగానే

ఇంతకి ఆయన ఏ పార్టీ ? గెలిచింది జనసేన తరపున అయితే వైసిపి నేతలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఇదే ఇప్పుడు జనసేన, టిడిపి ని పట్టి [more]

Update: 2019-07-24 08:00 GMT

ఇంతకి ఆయన ఏ పార్టీ ? గెలిచింది జనసేన తరపున అయితే వైసిపి నేతలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఇదే ఇప్పుడు జనసేన, టిడిపి ని పట్టి కుదిపేస్తోంది. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి సొంత పార్టీని ఒకలా టిడిపి ని మరోరకంగా ఇరకాటంలో పెట్టేస్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను దేవుడు, రాముడిగా వైసిపి వారు కూడా పొగడని విధంగా పొగిడేస్తూ అధికారపార్టీకి చక్కిలి గింతలు పెడుతూ విపక్షానికి చుక్కలు చూపిస్తున్న రాపాక వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా చక్కెర్లు కొడుతోంది.

ఈ గూటి చిలక….

ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు చేదు గుళికలే మింగేలా చేశాయి. తమ పార్టీ నుంచి ఒక్కడైనా అసెంబ్లీలోకి వెళ్ళాడు కదా అనుకుని సంబర పడ్డారు పవనిజం సర్కిల్. తమ పవనిజాన్ని పాటగా పెడతారనే అంతా రాపాక వరప్రసాద్ పై బలమైన నమ్మకం పెట్టుకున్నారు వారంతా. వారు అంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణం వుంది. కారణం గెలిచిన ఒకే ఒక్క జనసేన ఎమ్యెల్యే వైసిపి లోకి జంప్ ఖాయమంటూ లోకం కోడై కూసింది. అయితే తాను వైసిపి లో చేరితే 152 వ నెంబర్ అవుతానే తప్ప జనసేన లోని నెంబర్ వన్ స్థానం కోల్పోతా అంటూ రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ కొత్త థియరీ చెప్పుకొచ్చారు. అదే నిజం అని జనసేన వర్గాలు భావించాయి. కానీ శాసన సభలో ఆయనకు అవకాశం వచ్చిన ప్రతిసారి జై జగన్ అంటూ రాపాక వరప్రసాద్ ఇచ్చే ప్రసంగాలకు జనసేన కు షాక్ లు ఇస్తుంది. మరో పక్క టిడిపి ని ఏ మాత్రం విడిచి పెట్టకుండా రాపాక రఫ్ ఆడేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే మీ ఏడుపు ఏమిటంటూ ప్రధాన విపక్షంపై నిప్పులు చెరుగుతూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ తెస్తున్న బిల్లులపై ప్రశంసల వర్షం కురిపించేస్తూ రాపాక వరప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు పై ఏమి మాట్లాడాలో తెలియక అటు జనసేన ఇటు టిడిపి తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.

అభివృద్ధి కోసమేనా …?

తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే తూర్పుగోదావరి జిల్లా నేత రాపాక వరప్రసాద్ ఈ విధానం అనుసరిస్తున్నారని అంటున్నారు. ఒక్కడుగా ఉండటం వల్ల జనసేన విధానాలంటూ విమర్శలు గుప్పిస్తే అయ్యే పని ఒక్కటి ఉండదని ఆయన తెలివిగా అధికారపార్టీలో చేరకుండానే తన సొంత నియోజకవర్గానికి అవసరమైన పనులు చక్కబెట్టుకుంటున్నారని సన్నిహితుల టాక్. రాజోలు నియోజకవర్గంలో ఎస్సి ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలు అత్యధికం. రాజకీయంగా కూడా రేపటి రోజున నియోజకవర్గంలో వ్యతిరేకత లేకుండా చేసుకోవాలన్నా వైసిపి తో రహస్య స్నేహితుడిగా రాపాక వరప్రసాద్ఉండక తప్పదని చెబుతున్నారు.

ప్రశ్నించే వారు లేకనేనా?

జనసేన అధినేతే స్వయంగా ఓడిపోయినందున తనను ప్రశ్నించే వారు కానీ ఇదేమిటని ధైర్యం చేసేవారు ఎవ్వరు లేరన్నది కూడా రాపాక వరప్రసాద్ స్ట్రేటజీ గా తెలుస్తుంది. వాస్తవానికి రాపాక వరప్రసాద్ కు స్వర్గీయ వైఎస్ రాజకీయ భిక్ష పెట్టారు. ఆయన మరణం తరువాత కాంగ్రెస్ లోనే కొనసాగి నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిట్టమన్న తిట్లన్నీ వైఎస్ జగన్ ను తిట్టిన రాపాక ఇప్పుడు అదే జగన్ ను పొగడటం గమనార్హం. ఒకప్పుడు తిట్టిన నోరే ఇప్పుడు పొగడటాన్ని మాత్రం ముఖ్యమంత్రి హోదాలో జగన్ బాగానే ఎంజాయ్ చేస్తున్నా జనసేన, టిడిపిలకు మాత్రం చెప్పుకోలేని మంటనే రాజేయడం చూస్తే రాజకీయాల్లో చిత్ర విచిత్ర విశేషాలకు కొదవ ఉండదని తెలుస్తుంది.

Tags:    

Similar News