క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి సింపతీ.. రీజనేంటంటే?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న వివాదాలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది. ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇక, ఈ ఎన్నికలకు [more]
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న వివాదాలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది. ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇక, ఈ ఎన్నికలకు [more]
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న వివాదాలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది. ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇక, ఈ ఎన్నికలకు సంబంధించిన వివాదాల ఎపిసోడ్ తెరమరుగై.. ఎన్నికల ప్రక్రియ తెరమీదికి వచ్చింది. ఇప్పటికే ప్రస్తుతమున్న షెడ్యూల్‌ను మారుస్తూ.. ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రీషెడ్యూల్ విడుదల చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఎన్నికల విషయంలో ప్రభుత్వం తప్పుచేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్‌తో దూకుడుగా వ్యవహరించి.. ప్రభుత్వం అభాసుపాలైందని అంటున్నారు.
క్షేత్ర స్థాయిలో….
అయితే.. ఇదే విషయంపై అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వంలోని సీనియర్లు, అధికారులు మరోవాదనను తెరమీదికి తెచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో సింపతీ పెరిగిందని అంటున్నారు. ఎన్నికల సమయంలో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బంది తగ్గుతారని.. సో.. ఇది ప్రజారోగ్యంపై ప్రభావం చూపించడమే అవుతుందని.. ప్రభుత్వం తీసుకువచ్చిన వాదన బాగానే ఉందని.. క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు అయిందని.. దీనినే ప్రజలు స్వాగతిస్తున్నారని అంటున్నారు. అయితే.. న్యాయ పరంగా చూసుకుంటే ఈ వాదనను పక్కన పెట్టి.. ఎన్నికలు నిర్వహించుకునేందుకు అంగీకరించారు.
ప్రజల తరుపున….
అయినప్పటికీ.. ప్రభుత్వం చేసిన చొరవ, ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టుల్లో.. సర్కారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేయాలని కోరడం.. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సంకేతాలు పంపించిందని చెబుతున్నారు. అంటే.. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇలా చేసిందా? లేక.. ప్రజారోగ్యమే ముఖ్యమనే భావనను చూపిందా? అనే విషయాల కంటే.. కూడా ప్రజారోగ్యాన్ని విస్మరించలేమంటూ.. సర్కారు చేసిన వాదనను ప్రజలు బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా వచ్చిందనే విషయం కంటే.. కూడా ప్రజల తరఫున ప్రభుత్వం గట్టి గళం వినిపించిందని చెబుతున్నారు.
టాస్ నిమ్మగడ్డ గెలిచినా…?
మొత్తానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. కొంత మేరకు ఫలించిందనే వాదన బలంగానే వినిపిస్తుండడం గమనార్హం. అయితే జగన్ ప్రభుత్వాన్ని ముందు నుంచి టార్గెట్ చేస్తోన్న ప్రతిపక్షాలు… అటు విమర్శకులు మాత్రం 151 + 5 + 156 సీట్లున్న బలమైన ప్రభుత్వం రాజ్యాంగం ముందు తలవంచక తప్పలేదని చెపుతున్నారు. ఇక ఈ పోరులో జగన్‌పై నిమ్మగడ్డ విజయం సాధించారని కొందరు అంటుంటే… వైసీపీ వాళ్లు మాత్రం టాస్ మీరు గెలిచారు… రేపు ఎన్నికల్లో విజయం సాధించి.. మ్యాచ్ మేము గెలిచి చూపిస్తామంటున్నారు.