ఈ సమయంలోనూ వారు సైలెంట్‌.. టీడీపీలో ఏం జ‌రుగుతోంది?

రాష్ట్ర ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో పెను ప్రకంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పటికే ఇద్దరు కీల‌క నేత‌లు అరెస్టయి.. రిమాండ్‌కు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు, [more]

Update: 2020-06-20 11:00 GMT

రాష్ట్ర ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో పెను ప్రకంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పటికే ఇద్దరు కీల‌క నేత‌లు అరెస్టయి.. రిమాండ్‌కు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. క‌రోనా నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మై.. ఈ నిర‌స‌న‌లు చేయాల‌ని పూస‌గుచ్చిన‌ట్టు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు ఎంత మంది చంద్రబాబు పిలుపుమేర‌కు ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టారు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కీల‌క‌మైన నాయ‌కులు.. మ‌రీ ముఖ్యంగా గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా చ‌క్రం తిప్పిన వారు ఒక్కరు కూడా రోడ్డు మీద‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఉన్నట్లా? ఉండీ లేనట్లా?

గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చ‌క్రం తిప్పిన గంటాశ్రీనివాస‌రావు, సీఆర్ డీఏ స‌హాపట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన పొంగూరు నారాయ‌ణ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా వ్యవ‌హ‌రించిన ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు త‌మ గ‌ళం వినిపించ‌లేదు. వీరు అప్పటి ప్రభుత్వంలో కీల‌కంగా చ‌క్రాలు తిప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఒక్క మాటంటే ఒక్కమాట కూడా గ‌ళం విప్పక‌పోవ‌డం, చంద్రబాబు పిలుపు మేర‌కు వారు క‌నీసం నిర‌స‌న‌ల్లోనూ పాల్గొన‌లేదు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీలో వీరు ఉన్నట్టా? ఉండీ లేన‌ట్టా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గంటా చిక్కుకునే అవకాశం…

అయితే, ఈ ముగ్గురు గురించి మ‌రో కీల‌క విష‌యం కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గ‌త ప్రభుత్వంలో ఈ ముగ్గురుపై కూడా తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విద్యాశాఖ‌కు సంబంధించి జ‌గ‌న్ ప్రభుత్వం ఇప్పుడు నాడు-నేడు చేప‌ట్టింది. ఈ క్రమంలోనే కొంద‌రు అధికారులు.. రాష్ట్రంలోని ప్రాథ‌మికోన్నత పాఠ‌శాల‌ల‌కు 2017-18 కాలంలో రంగులు వేశామ‌ని చెప్పార‌ట‌. దీనికి సంబంధించిన రికార్డులు కూడా చూపించారు. కానీ, ఆయా పాఠ‌శాల‌ల రంగులు వెలిసిపోవ‌డంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు. దీంతో ఈ కేసులు బ‌య‌ట‌కు ప‌డితే.. గంటా శ్రీనివాస‌రావు చిక్కుకునే అవ‌కాశం ఉంది.

అందుకే మౌనం…

అదే స‌మ‌యంలో మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌కు, సీఆర్ డీఏ భూములు, అమ‌రావ‌తి కంపెనీల విష‌యంలోను, భూముల విష‌యంలో పాత్ర ఉంద‌ని ఆది నుంచి కూడా జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ ఏ విష‌యంలో విచార‌ణ జ‌రిగితే.. ఏం జ‌రుగుతుందోన‌ని ఆయ‌న కూడా మౌనం వ‌హించారు. గ‌తంలోనూ అనేక సంద‌ర్భాల్లో చంద్రబాబు అనేక ఉద్యమాల‌కు పిలుపు ఇచ్చినా సైలెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

పుల్లారావు మీద అనేకం…

ఇక‌, మ‌రో కీల‌క‌మైన నాయ‌కుడు.. ప్రత్తిపాటి పుల్లారావు కూడా సైలెంట్ అయ్యారు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి వెంకాయ‌మ్మ చేతివాటం బాగానే ప్రద‌ర్శించారు. న‌కిలీ పురుగు మందుల దుకాణాల‌ను ప్రోత్సహించి భారీగానే దోచేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటిపైనా విచారించే అవ‌కాశం ఉండ‌డంతో ఈయ‌న కూడా మౌనం పాటించారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు పార్టీలో ఎవ‌రికి వారు తాము తీసుకున్న గోతిలో తామే ప‌డతామ‌నే భ‌యంతో అల్లాడుతున్నార‌న‌డానికి ఇది చ‌క్కని తార్కాణం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News