ఆ డిసిషన్ మంచిదేనా…?

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అందరూ ఊహించినట్లుగానే తన నిర్ణయాన్ని వెలువరించారు. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం నిజంగా సంచలనమే. వారంతా 2023వరకూ [more]

Update: 2019-07-28 17:30 GMT

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అందరూ ఊహించినట్లుగానే తన నిర్ణయాన్ని వెలువరించారు. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం నిజంగా సంచలనమే. వారంతా 2023వరకూ అంటే నాలుగేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా వేటు వేశారు. యడ్యూరప్ప సోమవారం బలనిరూపణకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న సంచలన నిర్ణయం కన్నడనాట హాట్ టాపిక్ గా మారింది.

రేపు బలపరీక్ష…..

యడ్యూరప్ప రేపు బలపరీక్షకు దిగబోతున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గితే ఆయన కన్నడ నాట మరో నాలుగేళ్ల పాటు చక్రం తిప్పే అవకాశముంది. అయితే స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి యడ్యూరప్పకు కలసి వచ్చేట్టుగానే కన్పిస్తుంది. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 224. అయితే 17మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 207కు చేరుకుంది. దీంతో విశ్వాస పరీక్షలో గట్టెక్కాలంటే 104 మంది సభ్యుల మద్దతు అవసరం.

సభలో బలం….

కానీ యడ్యూరప్పకు మద్దతుగా ఇప్పటికే 105 మంది సభ్యులున్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇవ్వడంతో యడ్యూరప్ప మద్దతుదారుల సంఖ్య 107కు చేరింది. రేపు జరిగే విశ్వాస పరీక్షలో గట్టెక్కేందుకు ఛాన్స్ స్పష్టంగా కన్పిస్తుంది. అయితే ఇక్కడే మరో పితలాటకం కనపడుతుంది. ఇప్పుడు అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటు పడటంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. న్యాయస్థానంలో దీనిపై ఎప్పటికి కన్ క్లూజన్ వస్తుందో తెలియదు. అప్పటి వరకూ యడ్యూరప్ప ప్రభుత్వం సేఫ్ గానే ఉంటుంది.

ఉప ఎన్నికలు జరిగితే….

అలాగే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ కు కూడా తెలియజేయాలి. అంతా ఓకే అయితే ఖాళీగా ఉన్న 17 స్థానాలకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు జరగాలి. ఈ ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప ఖచ్చితంగా ఎనిమిది స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. మరి కన్నడ నాట రోజుకో ట్విస్ట్ తో పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ స్పీకర్ ద్వారా తమ వ్యూహాన్ని బయటపెడితే.. యడ్యూరప్ప ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళతారో చూడాలి.

Tags:    

Similar News