ఆ వైసీపీ షాడో నేతలు జిల్లాలు పంచేసుకున్నారా…?
వైసీపీలో ఓ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 11 జిల్లాలను ఓ ముగ్గురు నాయకులు శాసిస్తున్నారనే వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల [more]
వైసీపీలో ఓ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 11 జిల్లాలను ఓ ముగ్గురు నాయకులు శాసిస్తున్నారనే వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల [more]
వైసీపీలో ఓ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 11 జిల్లాలను ఓ ముగ్గురు నాయకులు శాసిస్తున్నారనే వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల కాలంలో జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, నాయకులకు మధ్య పడడం లేదు. ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఈ విషయంలో ఎవరికి వారు దూకుడుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. ఉత్తరాంధ్ర వ్యవహారాలను చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇక్కడి మూడు జిల్లాలపై ఆయన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వివాదాలను పరిష్కరించాలని…..
ఇక, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల విషయంలో నాయకులను సమన్వయం చేయడంతోపాటు పార్టీలో తలెత్తే వివాదాలను పెద్దవి కాకుండా చూడడం, సర్దు మణిగేలా చేసే బాధ్యతను పార్టీ నాయకుడు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అదేవిధంగా ప్కాశం, నెల్లూరు, కడప, అనంతపురం మినహా మిగిలిన జిల్లాల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. ప్రకాశం, నెల్లూరులో తనకు అత్యంత విశ్వసనీయ మంత్రులు ఉండడంతో జగన్ అక్కడి వివాదాలను వారే పరిష్కరించుకునేలా ఆదేశాలు ఇచ్చారు. పేరుకు మాత్రమే ప్రకాశంకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయన చేసేదేం లేదట.
వారికి అనుకూలంగా….
అనంతపురం జిల్లా బాధ్యతలు ఎన్నికలకు ముందు నుంచే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చూస్తున్నారు. కడపలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకున్నారు. అయితే, వీరిలో వైవీ, సాయిరెడ్డి, పెద్దిరెడ్డిల వ్యవహారం.. పార్టీలో తీవ్రస్థాయి చర్చకు దారితీస్తోంది. ఈ ముగ్గురు నాయకులు స్థానిక సమస్యలపై దృష్టి పెడుతున్నా.. తమకు అనుకూలంగా ఉన్న నాయకుల పక్షానే తీర్పులు చెబుతున్నారని, వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఒక రకంగా వారు జిల్లాలను పంచుకుని పెత్తనం చేస్తున్నారని వైసీపీలో చర్చ సాగుతోంది. అందరూ కృషి చేస్తేనే పార్టీ విజయం సాధించిందని, అయితే, ఇప్పుడు పార్టీలో కొందరికే ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఇటీవల బాహాటంగానే విమర్శలు చేశారు. చిత్తూరులోనూ ఇదే తరహా వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం.
ఎవరూ మాట వినకపోవడం…..
ఇక, విశాఖలో సాయిరెడ్డి దూకుడుపై మంత్రి ఒకరు గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలు చాలా సార్లు ఎమ్మెల్యేలు చెప్పిన మాటకే తలూపేయడంతో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన నేతలకు తీవ్ర అన్యాయం జరగుతోందన్న స్వరాలు పెరుగుతున్నాయి. స్థానిక నేతలు కనీసం తమ గోడు చెప్పే టైం కూడా వీరు ఇవ్వడం లేదట. ఇక కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రుల మాటకు కూడా వీరు విలు ఇవ్వడం లేదట. మొత్తానికి జగన్ ఒకటి తలిస్తే.. ఈ ముగ్గురూ మరో విధంగా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి జగన్ ఈ వివాదాలను ఎలా సెట్ చేస్తారో ? చూడాలి.