వీరిద్దరికంటే అందులో చంద్రబాబే నయమట

జగన్, కేసీఆర్ లు మోనార్క్ లు. తాము తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనుకునే మనస్తత్వం ఇద్దరిదీ. ప్రాంతీయ పార్టీల్లో ఈ నియంతృత్వ వైఖరి సహజమే అయినా చంద్రబాబు [more]

Update: 2021-07-29 06:30 GMT

జగన్, కేసీఆర్ లు మోనార్క్ లు. తాము తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనుకునే మనస్తత్వం ఇద్దరిదీ. ప్రాంతీయ పార్టీల్లో ఈ నియంతృత్వ వైఖరి సహజమే అయినా చంద్రబాబు కొద్దిలో గొప్ప నయం. ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానిని అందరి చేత ఒప్పించి అమలు చేస్తారు. దీంతో పాటు చంద్రబాబు నేతలతో గ్యాప్ పెంచుకునే పనిచేయరు. కానీ జగన్, కేసీఆర్ లు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏమాత్రం పట్టించుకోరు.

వారిని చూసే ఓట్లేసినా..?

నిజమే వారి ముఖం చూసే జనం ఓట్లేశారనుకుందాం. కానీ వారు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు. వారి సమస్యలను వినేందుకు ఓపిక ఉండాలి. కానీ జగన్, కేసీఆర్ లకు ఆ ఓపిక ఉండదు. అందుకే ఇద్దరినీ వదిలిపోయే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా సమయం వచ్చినప్పుడు వీరిని వీడిపోయే నేతలే ఎక్కువగా కన్పిస్తారు. ఇద్దరి ఏకపక్ష వైఖరే ఇందుకు కారణమని చెప్పాలి.

ఉద్యమం నాటి నుంచి….

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి అనేక మంది నేతలు ఆయనను వదలి వెళ్లిపోయారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, డి.శ్రీనివాస్, జితేందర్ రెడ్డి తాజాగా ఈటల రాజేందర్ వంటి నేతలు కేసీఆర్ తో పడక పక్కకు వెళ్లిపోయారు. డి.శ్రీనివాస్ వంటి నేతలు పదవి కోసం పార్టీలో సాంకేతికంగానే ఉన్నారు తప్ప ఆయన కేసీఆర్ కు దూరమయ్యారు. ఇదే విధంగా జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకూ అనేక మంది దూరమయ్యారు.

పార్టీ పెట్టిన తర్వాత…

జగన్ పార్టీ పెట్టిన తర్వాత మైసూరా రెడ్డి కీలక నేతగా పార్టీలో ఉన్నారు. ఆయన జగన్ వైఖరి నచ్చక వెళ్లిపోయారు. ఆ తర్వాత సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి నేతలు జగన్ కు బైబై చెప్పి వెళ్లిపోయారు. ఇక రఘురామ కృష్ణరాజు వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆయన పార్టీలోనే ఉండి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ ఒకే రకమైన సమస్య. లోపం వారిలోనే ఉందని నేతలు అంటుంటే, లేదు లేదు.. వెళ్లే వారు కుంటిసాకులు చెబుతున్నారని ఇద్దరు సన్నిహితులు సమర్థించుకుంటుండటం విశేషం

Tags:    

Similar News