టీడీపీ మాజీలు వైసీపీలో చేరినా?

ఒక పార్టీలో ఏదో స్థాయిలో వెలిగిన నాయకుడు పక్క పార్టీలోకి ఫిరాయిస్తే అదే హోదా దక్కిన సందర్భాలు బహు అరుదు. పైగా ఉన్న స్థానం కూడా తగ్గి [more]

Update: 2020-09-05 00:30 GMT

ఒక పార్టీలో ఏదో స్థాయిలో వెలిగిన నాయకుడు పక్క పార్టీలోకి ఫిరాయిస్తే అదే హోదా దక్కిన సందర్భాలు బహు అరుదు. పైగా ఉన్న స్థానం కూడా తగ్గి కీర్తి మసకబారుతుంది. జగన్ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేస్తారు అనుకున్నారు. అయితే జగన్ మాత్రం తన పార్టీలోకి ఎవరైనా వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షరతు పెట్టారు. దాంతో ఎమ్మెల్యేలు అలా ఉండిపోయినా మాజీ ఎమ్మెల్యేలు లగెత్తుకుని ఫ్యాన్ నీడకు చేరారు. వారికి ఏ రకమైనా ఆంక్షలు లేకపోవడంతో జగన్ కూడా వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకున్నారు. అలా ఏపీలోని పదమూడు జిల్లాల నుంచి మాజీలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఉన్న వారికే లేదుగా….?

వైసీపీలోనే పదేళ్ల పాటు కష్టపడిన వారికి ఇపుడు కనీసం నామినేటెడ్ పదవి లేదు, చాలా మంది ఆశావహులకు నాడు ఎన్నికల్లో టికెట్లు జగన్ ఇవ్వలేదు, వారిని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తానని అప్పట్లో జగన్ ప్రామిస్ చేశారు. కానీ జరిగింది వేరు. పదవులన్నీ సామాజిక సమీకరణలతో చాలా మందికి దక్కలేదు. ఇక జగన్ బీసీ మంత్రంతో కూడా అనేక మంది అవకాశాలు కోల్పోయారు. మరి కొన్ని చోట్ల పదవులకు ఎక్కువమంది పోటీ పడడంతో ఎవరికీ దక్కకుండా పోయాయి. ఇలా వైసీపీలో పదవుల గోల ఓ రేంజిలో ఉంది. కానీ ఇపుడు వీరికి తోడు అంటూ పొలోమంటూ కొత్తవారు టీడీపీ, ఇతర పార్టీల నుంచి
వైసీపీలోకి వచ్చేశారు.

ఆశించి వైసీపీలో చేరినా…?:

టీడీపీలో మంచి స్థానాల్లో ఉన్న వారు ఎన్నికల్లో ఓడగానే వైసీపీ పంచన చేరారు. వారు అధికార పార్టీలోకి వస్తే తమకు తగిన గౌరవం పదవులు దక్కుతాయని ఎంతో ఆశించారు. విశాఖ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటూ మైనారిటీ నేతగా వెలిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ వైసీపీలోకి ఆరు నెలల క్రితం ఫిరాయించారు. ఇపుడు ఆయన ఎక్కడున్నారో ఆయన అనుచరులకే తెలియడంలేదు. తనకు ఎమ్మెల్సీ పదవిని మైనారిటీ కోటాలో జగన్ ఇస్తారని రహమాన్ ఆశించారని టాక్. కనీసం వీఎంఆర్డీయే చైర్మన్ పదవి ఇస్తారని కూడా ఊహించారు. ఇక విశాఖ మేయర్ సీటు మీద కూడా కన్నేశారని టాక్. ఏది కాకపోయినా స్టేట్ మైనారిటీ కారోరేషన్ చైర్మన్ ఇస్తారనుకున్నారు. కానీ వైసీపీలోనే పెద్ద పోటీ ఉంది. దాంతో రహమాన్ తనకు తానుగా అలా సైడ్ అయిపోయారు.

వీరూ అంతేగా …?

ఇక గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కూడా వైసీపీలో చేరి మేయర్ అవుదామనుకున్నారు. కనీసం ఏదో ఒక పోస్ట్ ఇస్తారని ఆశపడ్డారు. ఆయన కూడా అంతే. అలాగే ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఒకసారి నెగ్గి జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చింతలపూడి వెంకటరామయ్య వైసీపీలో చేరి ఏమీ బావుకోలేదు. ఖాళీగా ఉన్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేసిన గిరిజన నేత పసుపులేటి బాలరాజు కూడా వైసీపీలో చేరారు. తన కూతురు దర్శినికి జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి ఇస్తారని ఆయన ఆశించారు. కానీ వైసీపీలో పోటీ ఎక్కువగా ఉంది. దాంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇపుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఈయన కూడా టీడీపీ రూరల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి మరీ జగన్ చేత లేటెస్టుగా కండువా కప్పుకున్నారు. మరి ఆయన కూడా వైసీపీలో ఒక మూలన ఉండాల్సిందేనా అంటే జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి మరి.

Tags:    

Similar News