కాపు నేతలు ఆట మొదలెట్టారు ?

టిడిపి కాపు నేతలు ఇప్పుడు అధినేత చంద్రబాబు కు నిద్ర పట్టనీయడం లేదు. ఆయన విదేశీ పర్యటనలో వున్నప్పుడే కుంపటి రాజేసిన వారు తరువాత వేస్తున్న అడుగులు [more]

Update: 2019-06-30 04:30 GMT

టిడిపి కాపు నేతలు ఇప్పుడు అధినేత చంద్రబాబు కు నిద్ర పట్టనీయడం లేదు. ఆయన విదేశీ పర్యటనలో వున్నప్పుడే కుంపటి రాజేసిన వారు తరువాత వేస్తున్న అడుగులు తెలుగుదేశం శిబిరంలో గుబులు పుట్టిస్తున్నాయి. కాకినాడలో రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు తో తొలిభేటీ తరువాత ఓడిపోయిన ఎమ్యెల్యేలు అంతా ఇది చెప్పుకోదగ్గ సమావేశం కాదని సాధారణ సమావేశమే అని తేల్చేశారు. అయితే ఆ తరువాత ప్రజావేదిక కూల్చివేతపై తోట త్రిమూర్తులు టిడిపి వాదనకు భిన్నంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సరైనదని వ్యాఖ్యానించి సంచలనం చేశారు.

కలవరం లో పసుపు పార్టీ ….

టిడిపి కాపునేతలు తేడాకొడుతుండటంతో పార్టీ అధిష్టానం కలవరపడింది. వెంటనే వీరందరితో భేటీ కి వెంటనే పిలుపునిచ్చింది. తెలుగుదేశం అధిష్టానం ఇలా పిలవగానే ఎస్ బాస్ అనే వారంతా భిన్నంగా స్పందించడం అనుమానాలకు దారి తీస్తుంది. సోమవారం అమరావతిలో టిడిపి కాపు నేతలతో అధిష్టానం సమావేశం ఏర్పాటైంది. అయితే ఈ సమావేశానికి ముందే హైదరాబాద్ కేంద్రంగా టిడిపి కాపు నేతలు కలుస్తున్నారు. అధిష్టానం తో ఏ అంశాలు చర్చించాలి అనే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, తోట త్రిమూర్తులు నడుమ జరిగిన చర్చలు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వీరందరికి బిజెపి సహా ఇతర పార్టీలనుంచి ఆహ్వానాలు అందుతూ ఉండటంతో కాపు టిడిపి నేతలు తమ భవిష్యత్తు పై సమాలోచనలు వేగవంతం చేశారు. అయితే ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి

Tags:    

Similar News