తోటకు తేడా అక్కడే వచ్చిందట

తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి కి బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు. ఆయన టిడిపికి రాం రాం చెప్పి జగన్ [more]

Update: 2019-09-08 14:30 GMT

తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి కి బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు. ఆయన టిడిపికి రాం రాం చెప్పి జగన్ సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చేసుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తోట త్రిమూర్తులు అసంతృప్తి గానే వున్నారు. టిడిపి లో కాపులకు సరైన ప్రాధాన్యత లేదనే ప్రధాన పాయింట్ తో కోస్తా టిడిపి కాపు నేతలను ఏకం చేసి పెద్ద పంచాయితీనే తోట త్రిమూర్తులు నడిపారు. ఆ తరువాత అధినేత చంద్రబాబు తో సైతం సుదీర్ఘ భేటీని కాపునేతలు అయ్యారు. వారికి బాబు అనేక హామీలు ఇచ్చారు. అప్పటికి తాత్కాలికంగా కాపునేతలు చల్లబడినా పార్టీలో ఒక వర్గానికి ప్రాధాన్యత పెరుగుతూ రావడంతో ఇక గుడ్ బై కొట్టేయడమే బెటర్ అని భావించి ఆయన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు సైతం డుమ్మా కొట్టేశారు.

ముందు విజయసాయి తో …

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తో నిన్న భేటీ అయ్యాక తోటకు జగన్ అపాయింట్ మెంట్ ఫైనల్ అయినట్లు వైసిపి వర్గాల సమాచారం. తోట రాకతో తూర్పు గోదావరి లో కాపు సామాజికవర్గంలో వైసిపి కి మరింత పట్టు దొరుకుతుంది. పార్టీ కి ఆయన రాకతో లాభనష్టాలు అంచనా వేసుకున్నాకే విజయసాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ, కాపు సామాజికవర్గాల నడుమే అధికార బదిలీ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణు గోపాల్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల నడుమ తోట రాకతో సఖ్యత ఏర్పడితే వైసిపి కి ఇక్కడ ఎదురు వుండే పరిస్థితి ఉండదు.

బిగుసుకున్న పాత కేసు …

దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. దశాబ్దాలు గా సాగుతున్న ఈ కేసు విచారణ కొనసాగుతూనే వుంది. టిడిపి లో మంత్రి పదవి దక్కక పోయినా ఈ కేసు మాఫీ కోసమే తోట త్రిమూర్తులు అధికారపార్టీలో కొనసాగారన్న ప్రచారం సాగింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ కేసులోని బాధితులకు ఎస్సి సర్టిఫికెట్లు జారీ అయ్యాయి దాంతో శిరోముండనం కేసులో ప్రస్తుతం తోట త్రిమూర్తులుకు చిక్కులు తప్పక పోవొచ్చన్న టాక్ నడుస్తుంది. దాంతో ఆయనకు వైసిపి లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని రామచంద్రపురం లో జోరుగా ప్రచారం సాగుతుంది. దాంతో బాటు అధికారానికి దూరంగా ఉండలేని నాయకుడిగా తోట త్రిమూర్తులుకు గట్టి పేరే వుంది. బిజెపి లోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ సాగిన ప్రచారానికి తెరదించి వైసిపినే తనకు అన్ని విధాలా శ్రేయస్కరం అని త్రిమూర్తులు భావించారని అనుచరుల అంచనా.

చక్రం తిప్పిన బోస్ …

వాస్తవానికి మంత్రి సుభాష్ చంద్ర బోస్ కి తోట త్రిమూర్తులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రామచంద్రపురం లో వుంది. అయితే నియోజకవర్గం నుంచి బోస్ మండపేట నుంచి పోటీ చేశాక సీన్ మారిపోయింది. తాను ఎరికోరిన చెల్లుబోయిన వేణుగోపాల్ కి బోస్ టిక్కెట్ ఇప్పించారు. అయితే వీరిద్దరి నడుమ సఖ్యత సన్నగిల్లింది. దాంతో వేణుకు చెక్ పెట్టేందుకు త్రిమూర్తులు ను వైసిపి లోకి ఎంట్రీ చేయించడమే సరైనదని బోస్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారంటున్నారు. బోస్ కి ఇష్టం లేదనే చాలా కాలంగా తోట త్రిమూర్తులు వైసిపి ఎంట్రీకి అడ్డు పడిందనే ప్రచారం ఉండగా ఇప్పుడు మారిన రాజకీయం తో ఇద్దరు శత్రువులు మంచి మిత్రులుగా ఆలింగనం చేసుకోనున్నారు. దాంతో దశాబ్దాలుగా వున్న తోట త్రిమూర్తులు – పిల్లి సుభాష్ చంద్రబోస్ శత్రుత్వానికి ఇప్పుడు చిత్రంగా చెక్ పడింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవ్వరు వుండరనేది వీరి విషయంలో నిరూపితం కావడమే కాదు తూర్పు గోదావరి రాజకీయాల్లో ఒక సంచలనమే అయ్యింది.

Tags:    

Similar News