బ్లాక్ మెయిలింగ్ కు బెదిరేది లేదు
రాజకీయాలు పలు రకాలు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ కూడా పాలిటిక్స్‌కు సుపరిచితమే! నాయకులు తమ చిత్తాన్ని చిత్తగించేందుకు, అధినేతలను తమవైపు తిప్పుకొనేందుకు అనేక ఫీట్లు చేస్తుంటారు. [more]
రాజకీయాలు పలు రకాలు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ కూడా పాలిటిక్స్‌కు సుపరిచితమే! నాయకులు తమ చిత్తాన్ని చిత్తగించేందుకు, అధినేతలను తమవైపు తిప్పుకొనేందుకు అనేక ఫీట్లు చేస్తుంటారు. [more]
రాజకీయాలు పలు రకాలు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ కూడా పాలిటిక్స్‌కు సుపరిచితమే! నాయకులు తమ చిత్తాన్ని చిత్తగించేందుకు, అధినేతలను తమవైపు తిప్పుకొనేందుకు అనేక ఫీట్లు చేస్తుంటారు. ఈ విషయంలో కొందరు సక్సెస్ కూడా అవుతున్న పరిస్థితిని మనం చూశాం. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ.. వ్యాఖ్యానించి.. తన నియోజకవర్గానికి పట్టిసీమ నుంచి సాగునీరు తెప్పించుకుని సక్సెస్ అయ్యారు. అయితే, ఇలా అందరూ సక్సెస్ అవుతారా ? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది.
పెద్దాపురం సీటు ఇచ్చినా….
తాజాగా ఇలాంటి రాజకీయాలనే ఎంచుకున్నారు తూర్పు గోదావరి జిల్లాపెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన తోట వాణి. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు తోట నరసింహం టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయితే, తన సతీమణికి పెద్దాపురం లేదా పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరడం, దానికి చంద్రబాబు ససేమిరా అనడంతో వెంటనే పార్టీ నుంచి జంప్ చేసి.. వైసీపీలోకి వెళ్లారు ఈ భార్యాభర్తలు. ఆ వెంటనే తోట వాణికి పెద్దాపురం నియోజకవర్గం సీటును జగన్ కేటాయించారు.
చినరాజప్ప గెలవడంతో…
అయితే, ఎన్నికల్లో ఎంతగా జగన్ సునామీ వీచిందో అందరికీ తెలిసిందే. ఈ సునామీలో టీడీపీ ఉద్ధండులే కొట్టుకుపోయారు. అలాంటిది ఇక్కడ మాత్రం మాజీ హోం మంత్రి చినరాజప్ప సునాయాసంగా విజయం సాధించారు. సరే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. సో.. తొట వాణి ఓటమిని కూడా వైసీపీ అధినేత జగన్ అలా నే తీసుకున్నారు. అయితే, తాను ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి.. తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇ వ్వాలని లేదా రాజ్యసబ సభ్యత్వం అయినా ఇప్పించాలని తోట వాణి డిమాండ్ చేస్తున్నారు.
పెద్దాపురం ఇన్ ఛార్జిగా…
అయితే, దీనిపై జగన్ నుంచి కానీ, పార్టీ నేతల నుంచి కానీ ఎలాంటి హామీ లభించలేదు. దీంతో ఇలా అయితే, తాను పార్టీ మారిపోతానంటూ తోటవాణి.. ఇటీవల కాలంలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇది లోపాయికారీగా నే ఉన్నా.. ప్రచారం మాత్రం భారీగానే ఉంది. అయితే, దీనిని వైసీపీ అధినేత జగన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పార్టీలో ఇలాంటి వాటికి ఏ మాత్రమూ తావు లేదు.. అనే పరిస్థితి కనిపిస్తోంది. తోట వాణి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కలిసి పార్టీలోకి వస్తాం ? మాకుం ఏం ఇస్తారని అడిగినా ఇప్పటికే చాలా మంది లైన్లో ఉన్నారని… తమ లాంటి వాళ్లకే ఎలాంటి హామీలు లేవని చెప్పడంతో ఆమె మళ్లీ స్లో అయ్యారని టాక్. అయినప్పటికీ.. ఒక పక్క నగరి ఎమ్మెల్యే రోజా విషయం తెలిసి కూడా తోట వాణి ఇలా వ్యవహరించడంతో పార్టీ అధినేత జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఉన్న ఇంచార్జ్ ఎన్నారై దవులూరి దొరబాబును మళ్లీ రంగంలోకి దింపారు. ఇప్పుడు ఈయనే ఇంచార్జ్‌గా ఉన్నారు.
బెదిరింపులు కుదరవని….
దీంతో తోట వాణి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పదవులు ఇవ్వకపోతే బీజేపీలోకి వెళ్లిపోతానని ఆమె బెదిరించడంతో పార్టీకే చెందిన ఓ సీనియర్ నేత తమ దగ్గర బెదిరింపులు పని చేయవని.. పార్టీలో ఉంటే ఉండొచ్చు… వెళితే వెళ్లవచ్చని నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఆమె బెదిరింపులో తోట దంపతులు వైసీపీ అధిష్టానానికి దూరమయ్యే పరిస్థితి వచ్చిందనేది వాస్తవం. మరి వాణి ఫ్యూచర్ ఏంటో ? చూడాలి.