బోసిపోతున్న తోట ఇల్లు..రాజ‌కీయం.. ఇక‌ క్లోజ్ అయినట్లేనా?

రాజ‌కీయాల్లో ఉన్న వారికి వ్యూహం అయినా ఉండాలి.. లేదా ఎదుటి ప‌క్షాన్ని నిలువ‌రించే ఎత్తుగ‌డైనా ఉండాలి. ఈ రెండూ లేన‌ప్పుడు రాజ‌కీయాలు ముందుకు సాగడం అనేది కష్టమే. [more]

Update: 2020-05-17 00:30 GMT

రాజ‌కీయాల్లో ఉన్న వారికి వ్యూహం అయినా ఉండాలి.. లేదా ఎదుటి ప‌క్షాన్ని నిలువ‌రించే ఎత్తుగ‌డైనా ఉండాలి. ఈ రెండూ లేన‌ప్పుడు రాజ‌కీయాలు ముందుకు సాగడం అనేది కష్టమే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు తూర్పు గోదావ‌రి జిల్లాకుచెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం తోట ఫ్యామిలీ. రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చామ‌నేది కాదు.. ఎంత వ్యూహంతో ముందుకు సాగుతున్నామ‌నేది కీల‌కం. ఈ విష‌యం రాజ‌కీయాల్లో ఉన్న వారు తెలుసుకోవాల్సిన ప్రధాన విష‌యం. మ‌రీముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోగ‌లిగే నేర్పు.. ఓర్పు కూడా చాలా ముఖ్యం. కానీ, ఇవేవీ లేకుండా కేవ‌లం ఒకే ఒక ల‌క్ష్యం పెట్టుకుని, దాని కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌స్తామంటే.. ప్రజ‌లు మెచ్చుకుంటారా? అంటే క‌ష్టమే.

జంప్ చేయడంతో…

ఇదే తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన తోట న‌ర‌సింహం, తోట వాణిల రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ కుటుంబం ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక మాదిరిగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు త‌మ ఇంటికి వ‌చ్చే కార్యక‌ర్తలు, పార్టీ నేత‌ల‌తో ఇల్లు, ప‌రిస‌రాలు కూడా క‌ళ‌క‌ళ‌లాడిపోయేవి. వీరికి వండి పెట్టేందుకు పెద్ద భ‌వ‌నాన్నే నిర్మించారు. అలాంటి ఇల్లు ఇప్పుడు బోసిపోతోంది. ఒక‌ప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం తోట వారి ఇంటి ముందు ప్రజ‌లు బారులుతీరేవారు. త‌మ స‌మ‌స్యలు చెప్పుకొని వాటిని ప‌రిష్కరించ‌మ‌ని వేడుకునే వారు కానీ, నేడు ఆ ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఏంట‌ని ఎవ‌రిని అడిగినా.. తోట కుటుంబం చేసుకున్న స్వయంకృతం అంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీకి ఇలా జంప్ చేయ‌డాన్ని స్థానిక ప్రజ‌లు హ‌ర్షించ‌లేక పోయారు.

చినరాజప్పను ఓడించాలనే….

దివంగ‌త మాజీ మంత్రి మెట్ల స‌త్యనరాయ‌ణ కుమార్తె అయిన తోట వాణి భ‌ర్త తోట న‌ర‌సింహం సైతం జ‌గ్గంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కాకినాడ ఎంపీగా ఉన్న తోట న‌ర‌సింహం ఫ్యామిలీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రజ‌ల కోసం కాకుండా త‌మ వ్యక్తిగ‌త క‌క్షల కోసం అప్పటి హొం మంత్రి చిన‌రాజ‌ప్పను ఓడించ‌డ‌మే ధ్యేయం వైసీపీలోకి వెళ్లడం, పెద్దాపురం నుంచి పోటీ చేయ‌డం వంటి ప‌రిణామాలు వారికి న‌ష్టం చేకూర్చాయి. వీరి రాజ‌కీయ జంపింగ్‌ల‌ను ప్రజ‌లు అంత పాజి టివ్‌గా రిసీవ్ చేసుకోలేదు. దీంతో తోటవాణి ఓడిపోవాల్సి వ‌చ్చింది.

థిక్కార ధోరణితో…

పోనీ.. ఆ త‌ర్వాత అయినా.. నిల‌క‌డైన రాజ‌కీయాలు చేసి ఉంటే.. గ‌తం తాలూకు హ‌వా నిలిచి ఉండేది. కానీ, వైసీపీలో ఏదో నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించ‌డం, కీల‌క నేత‌ల‌ను క‌లుపుకొని పోక‌పోవ‌డం వంటివి తోట ఫ్యామిలీని రాజ‌కీయాల్లో న్యూట్రల్ చేశాయి. నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తారా ? మా దారి మేం చూసుకోమా ? అని పార్టీ అధిష్టానంపైనే ధిక్కార ధోర‌ణితో మాట్లాడాడ‌డంతో జ‌గ‌న్ వీరిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే ఉంది. అందుకే తోట వాణిని ఎన్నిక‌ల త‌ర్వాత పెద్దాపురం పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పించేసి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న ద‌వులూరి దొర‌బాబుకే పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.

వ్యూహం లేకపోవడం వల్లనే…

దీంతో ఏకంగా బీజేపీలోకి జంప్ చేయాల‌ని చూస్తున్నార‌నే వాద న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్తవానికి వైసీపీ తీర్థం పుచ్చుకున్న స‌మ‌యంలో గ‌ట్టిగా ప్రయ‌త్నించి ఉంటే.. రాజ‌ప్పపై ఉన్న వ్యతిరేక‌త తోట వాణికి ప్లస్ అయి ఉండేద‌నే వాద‌న కూడా ఉంది. కానీ, ఎంత సీనియ‌ర్ అయినా.. తండ్రి రాజ‌కీయాల‌ను పుణికి పుచ్చుకుని, భ‌ర్త వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. వ్యూహం లేక పోవ‌డం వ‌ల్లే.. తోట వాణి చ‌తికిల ప‌డ్డారు. ఇప్పటికీ కూడా తోట వాణి కానీ, న‌ర‌సింహం కానీ నిర్మాణాత్మక రాజ‌కీయాలు చేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక‌, రాబోయే రోజుల్లో వీరి రాజకీయాల‌కు ఇక‌, ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News