‘ తోట ‘ వాణి ఇక దొరకరటగా

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో నాయ‌కులు కూడా ఊహించ‌లేని ప‌రిస్థితులు రాజ్యమేలుతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో పార్టీల [more]

Update: 2019-09-30 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో నాయ‌కులు కూడా ఊహించ‌లేని ప‌రిస్థితులు రాజ్యమేలుతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో పార్టీల ప‌రిస్థితి దిన దిన‌గండంగా మారుతోంది. నాయ‌కులు గెలిచినా.. ఓడినా.. తాము కోరుకున్న ప‌ద‌వులు ద‌క్కక పోవడంతో అసంతృప్తితోనే కాలం గ‌డుపుతున్న ప‌రిస్థితి ఉంది. ఎప్పుడు ఈ నాయ‌కులు ఎటు జంప్ చేస్తారో ?చెప్పలేని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయ‌కురాలు తోట వాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

టీడీపీలో ప్రాధాన్యత ఉన్నా….

ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ..ఆమె పార్టీ మార‌తార‌ని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, ఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు చూస్తే.. తోట న‌ర‌సింహం.. కాంగ్రెస్ లో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయ‌న జ‌గ్గంపేట నుంచి 2004, 2009లో గెలిచి మంత్రిగా కూడా చేశారు. ఆయ‌న భార్య తోట వాణి మాజీ మంత్రి మెట్ల స‌త్యనారాయ‌ణ కుమార్తె కావ‌డం విశేషం. అయితే, రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న 2014లో టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. ఐదేళ్లపాటు పార్టీలో లోక్‌స‌భ టీడీపీ ప‌క్ష నేత‌గా కూడా కీల‌క బాధ్యత‌లు చూశారు. అయితే, ఆయ‌న కోరిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించ‌లేదు.

ఓటమి తర్వాత…

అంటే, త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించడంలేద‌ని, త‌న స‌తీమ‌ణి తోట వాణికి పెద్దాపురం లేదా పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. అయితే పెద్దాపురంలో అప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పటి హోం మంత్రి చిన‌రాజ‌ప్పకు చంద్రబాబు ఈ టికెట్‌ను రెండో సారి కూడా క‌న్ఫర్మ్ చేయ‌డంతో తోట కుటుంబం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిపోయింది. పిఠాపురంలోనూ మొన్న ఎన్నిక‌ల్లో అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ర్మనే పోటీ చేశారు. ఈ క్రమంలోనే తోట వాణి.. పెద్దాపురం నుంచి పోటీ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపించినా.. రాజ‌ప్ప ముందు వాణి నిల‌వ‌లేక పోయారు. దీంతో తోట వాణి నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇన్ ఛార్జి పదవిపై…

వాస్తవానికి పెద్దాపురంలో వైసీపీ త‌ర‌ఫున అప్పటి వ‌ర‌కు ఎన్నారై ద‌వులూరి దొర‌బాబు ఇంచార్జ్‌గా ఉన్నారు. అయినా ఆయ‌న‌ను ప‌క్కన పెట్టిన జ‌గ‌న్‌.. తోట వాణికి ఇచ్చారు. ఇక, ఇప్పుడు తోట వాణి ఓట‌మి పాల‌వ‌డంతో.. దొర‌బాబు త‌న‌కే ఇంచార్జ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రోప‌క్క, టీడీపీ అసంతృప్తి నేత బొడ్డు భాస్కర‌రామారావు తోట వాణికే మ‌ద్దతు ఇస్తున్నారు. అంతేకాదు, తోట వాణి పార్టీ మార‌తార‌ని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని భావిస్తున్న నేప‌థ్యంలో(ఆమె ఖండించారు) బొడ్డు భాస్కర‌రామారావు కూడా ఈ ప‌ద‌వి కోసం ప్రయ‌త్నిస్తున్నారు. దీంతో పెద్దాపురం వైసీపీలో ఇంచార్జ్ పోస్టు కోసం పోటీ ప్రారంభ‌మైంది. ఈ క్రమంలో జ‌గ‌న్ ఎవ‌రికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

కొంతకాలంగా…..

అయితే, తోట వాణి మాత్రం ఎవ‌రికీ క‌నిపించ‌క పోవ‌డం, మీడియాకు కూడా దూరం కావ‌డం ఆస‌క్తిగా మారింది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిన చోట్ల కూడా వైసీపీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప‌నులు చ‌క్కపెడుతూ అధికారుల‌పై గ్రిప్ తెచ్చుకుని దూసుకుపోతున్నారు. కాని పెద్దాపురంలో మాత్రం ఈ ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో తోట వాణి రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News