గంటా వెంట ఒక్కొక్కరుగా?

జగన్ మూడు రాజధానులు నిర్ణయం టీడీపీలోనూ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేరుగా జగన్ నిర్ణయాన్ని [more]

Update: 2019-12-19 05:00 GMT

జగన్ మూడు రాజధానులు నిర్ణయం టీడీపీలోనూ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేరుగా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటకే విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. గంటా శ్రీనివాసరావు తరహాలోనే అనేకమంది జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటంతో టీడీపీలో అయోమయం నెలకొంది.

విశాఖలో రాజధాని ఏర్పాటుకు…

గంటా శ్రీనివాసరావు బాటలో నడిచేందుకు అనేక మంది నేతలు రెడీ అవుతున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై వస్తున్న సానుకూలతతో టీడీపీ నేతలు వెనకడుగు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ ది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. తాము జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకమని చంద్రబాబు బాహాటంగానే చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరగకూడదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు అంటున్నారు.

కొండ్రుమురళి సయితం….

తాజాగా గంటా శ్రీనివాసరావు బాటలోనే టీడీపీ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళి పయనిస్తు న్నట్లుంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని నిర్మాణాన్ని కొండ్రుమురళి సమర్థించారు. అంతేకాదు చంద్రబాబు విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాజధాని అమరావతిలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి కాదని కొండ్రు మురళి ముక్తాయింపు ఇచ్చారు. ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేయడం పిచ్చి పనిగా కొండ్రు మురళి అభివర్ణించారు. అవసరమైతే ఈ విషయంలో తాము చంద్రబాబును ఒప్పిస్తామంటున్నారు.

మిగిలిన ఎమ్మెల్యేలు…..

గంటా శ్రీనివాసరావు స్వరానికి ఒక్కొక్కరుగా తోడవుతుండటంతో టీడీపీ అధిష్టానం గందరగోళంలో పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది గెలిచారు. శ్రీకాకుళం ఇద్దరు, విశాఖపట్నం నలుగురు విజయం సాధించారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణ తప్పించి పయ్యావుల కేశవ్ ఒక్కరే గెలిచారు. ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబు తీసుకున్న స్టాండ్ ను తప్పుపడుతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ లైన్ ను ధిక్కరిస్తున్నారు. మొత్తం మీద గంటా వెంట ఒక్కొక్కరే నడుస్తుండటం పార్టీ అధినేతను ఆందోళనలో పడేసింది.

Tags:    

Similar News