ఎమ్మెల్యేలు ఇక వెళ్లరట… కారణం ఇదేనట?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా కష్టాల్లో ఉంది. మరో నాలుగేళ్లు పార్టీని నడపటం చాలా కష్టమైన పనే. జిల్లాకు ఒకరిద్దరు తప్ప ఎవరూ యాక్టివ్ గా లేరు. [more]

Update: 2020-06-13 12:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా కష్టాల్లో ఉంది. మరో నాలుగేళ్లు పార్టీని నడపటం చాలా కష్టమైన పనే. జిల్లాకు ఒకరిద్దరు తప్ప ఎవరూ యాక్టివ్ గా లేరు. ఇప్పుడు సీనియర్ నేతలు ఎక్కువమంది వైసీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కోలుకోవడం కష్టమేనని భావించిన సీనియర్ నేతలు ఇలా పార్టీని మధ్యలో వదిలేసి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఇక ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఉండటం కష్టమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే టీడీపీ ఎమ్మెల్యేలు కొంత కుదురుకున్నారని చెబుతున్నారు.

ముగ్గురు వెళ్లినా…..

తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితిని చూసిన వారెవరైనా ఆ తప్పు చేయరన్న నమ్మకం పార్టీ అధిష్టానంలో ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది. ఏడాది లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి ఝలక్ ఇచ్చి వెళ్లిపోయారు. వీరిలో వల్లభనేని వంశీ, కరణం బలరాంలు పార్టీకి అత్యంత నమ్మకస్తులు. కొన్నేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారే. మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి మాత్రం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మాత్రమే.

వాళ్లు వెళ్లి సాధించిందేమిటి?

ఇక వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో పెద్దగా సుఖపడుతుంది లేదంటున్నారు. వాళ్లకు వాళ్ల నియోజకవర్గంలోనే వైసీపీ రూపంలో శత్రువులు ఉన్నారు. అది పక్కన పెడితే జగన్ నుంచి ఎలాంటి హామీలు దక్కడం లేదు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పడం మినహా జగన్ నుంచి ఎలాంటి హామీలు రావడం లేదు. ఏడాది నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్ చేసింది పెద్దగా ఏమీ లేదు.

వైసీపీ ప్రయత్నిస్తున్నా…..

దీంతో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలు వెళ్లి వాళ్లలాగా మారడం కంటే..నాలుగేళ్లు ఓపిక పడితే తమకు మంచిరోజులొస్తాయని భావిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లాలని ఊగుతున్నా అనుచరుల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారని తెలుస్తోంది. ప్రకాశం, విశాఖ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయినా, వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చకపోవడం చంద్రబాబుకు ఆనందం కల్గించే విషయమే.

Tags:    

Similar News