వన్ సైడ్ పోలింగ్…. ఆ కారణమేనా?

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయింది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లయింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు [more]

Update: 2021-04-18 00:30 GMT

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయింది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లయింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే మిగిలిన ఆరు శాసనసభ నియోజకవర్గాలను పక్కన పెడితే తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ పైనే టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

తిరుపతి పై ఆశలు….

తిరుపతి శాసనసభ నియోజకవర్గంపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లతో టీడీపీ ఓటమి పాలయింది. పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో మెజారిటీని సాధించింది. అయితే వైసీపీ తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిథిలోనే ఎక్కువగా దృష్టి పెట్టిందని, దొంగ ఓట్లను ఎక్కువగా పోలింగ్ చేయించిందని టీడీపీ ఆరోపిస్తుంది.

దొంగ ఓట్లపై….?

తిరుపతి ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు లక్షల మెజారిటీని ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు లక్ష్యంగా విధించడంతో తిరుపతి నియోజకవర్గంపై మంత్రులంతా దృష్టి పెట్టారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న విపక్ష పార్టీలు ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎందుకు దొంగ ఓట్లు పోలవుతాయంటున్నారు. టీడీపీ మాత్రం పోలింగ్ ప్రారంభమయిన గంట నుంచే ఈ ఆరోపణలను మొదలు పెట్టింది.

ముందుగానే ఓటమిని…?

టీడీపీకి తిరుపతి ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు వారం రోజుల పాటు ప్రచారం చేశారు. గెలిచే అవకాశం లేకపోయినా రెండో స్థానం కోసం, గతంలో వచ్చిన ఓట్లు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే వన్ సైడ్ పోలింగ్ జరిగిందన్నది టీడీపీ నేతల ఆరోపణలను బట్టి తెలుస్తోంది. దీంతో ముందుగానే తిరుపతి ఉప ఎన్నిక ఓటమిని అంగీకరించినట్లయింది.

Tags:    

Similar News