ఒక్క ఛాన్స్ కోసం ఇద్దరు వెయిటింగ్‌.. ఎవ‌రికి ద‌క్కుతుందో…?

నెల్లూరులో వైసీపీ రెడ్డి నేత‌ల మ‌ధ్య ప‌ద‌వి కోసం తీవ్ర పోరే సాగుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఇద్దరూ కూడా అత్యంత స‌న్నిహితులే కావ‌డం, ఇద్ద‌రూ మంత్రి [more]

Update: 2020-05-13 05:00 GMT

నెల్లూరులో వైసీపీ రెడ్డి నేత‌ల మ‌ధ్య ప‌ద‌వి కోసం తీవ్ర పోరే సాగుతోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఇద్దరూ కూడా అత్యంత స‌న్నిహితులే కావ‌డం, ఇద్ద‌రూ మంత్రి పీఠంపై క‌న్నేయ‌డంతో ఈ ఇద్దరి మ‌ధ్య పోరు భారీ రేంజ్‌లో సాగుతోంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఒక‌రు కోవూరు ఎమ్మెల్యే ప్రస‌న్నకుమార్‌రెడ్డి కాగా, మ‌రొక‌రు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధన్‌రెడ్డి. ఈ ఇద్దరూ కూడా వైసీపీలో కీల‌క నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా గుర్తింపు సాధించారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత మంత్రి పీఠాల‌పై క‌న్నేసిన విష‌యం తెలిసిందే.

వచ్చే విస్తరణలో…..

అయితే, అనూహ్యంగా ఒక బీసీకి, ఒక రెడ్డికి జ‌గ‌న్ ఇక్కడ నుంచి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వీరిద్దరు కూడా జూనియ‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, జూనియ‌ర్లకు మంత్రి ప‌ద‌వులు ఇవ్వడాన్ని నెల్లూరు జిల్లాలో సీనియ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నార‌నేది జిల్లా నేత‌ల టాక్‌. అలాగ‌ని బ‌య‌ట పెట్టడం లేదు. అయితే, వ‌చ్చే ద‌ఫా ఎలాగూ.. మ‌రో ఏడాదిన్నర‌లో (వైసీపీ ప్రభుత్వం ఏడాది పూర్తి అవుతోంది కాబ‌ట్టి) మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని, అప్పుడైనా నాకంటే నాకు ఛాన్స్ ద‌క్కదా.. అని ఇద్దరు నేత‌లు త‌మ అనుచ‌రుల‌తో చెప్పుకొంటున్నారు.

ఆనంకు ఛాన్స్ తక్కువే….

వాస్త‌వానికి ఈ ఇద్దరే కాకుండా ఆనం వంటి సీనియ‌ర్ నాయ‌కుడు కూడా లైన్‌లోనే ఉన్నారు. అయితే, ఆయ‌న‌కు ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయి. దీంతో కాకాని, ప్ర‌స‌న్న‌లు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస‌న్న కుమార్ దూకుడు ప్రదర్శిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. జ‌గ‌న్ కంట్లో ప‌డేలా ఆయ‌న ప్రతి విష‌యాన్నీ రాజ‌కీయం చేస్తున్నార‌ని స్థానిక నేత‌లు చెబుతున్నారు. నిత్యం వార్తల్లో ఉండ‌డ‌మే కాకుండా జ‌గ‌న్‌కు త‌న‌కు మ‌ధ్య రెపో బాగుంద‌నే ప్రచారం జ‌రిగేలా కూడా ప్రస‌న్న ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నార‌నే ప్రచారం ఉంది.

ఇద్దరి మధ్యే పోటీ అట….

ఇక‌ కాకాణి ఈ విష‌యంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నార‌ట‌. ఆయ‌న త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల‌కు ఈయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌ని ప్రచారంలో ఉంది. అదే టైంలో మంత్రి అనిల్‌కు స‌న్నిహితంగా ఉంటోన్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డికి కాకాణికి అస్సలు ప‌డ‌డం లేదు. అయితే, తాను సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. జ‌గ‌న్‌కు త‌న స‌త్తా తెలుసున‌ని అసెంబ్లీలో త‌న వాగ్ధాటికి జ‌గ‌న్ మంచి మార్కులే వేశార‌ని కాకాణి స‌న్నిహితుల ద‌గ్గర‌ చెప్పుకొంటున్నార‌ట‌. ఇలా ఇద్దరు నేత‌లు కూడా మంత్రి పీఠం కో సం నేనంటే నేనంటూ ఆశ‌లు పెట్టుకోవ‌డంతో నెల్లూరు వైసీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింద‌ట‌.

Tags:    

Similar News