పెద్ద ఫిట్టింగే పెట్టారే?
ఉండవల్లి అరుణ్ కుమార్. పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. స్వతహాగా న్యాయవాది. లిటిగేషన్లు పెట్టడంలో దిట్ట. తాజాగా ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం [more]
ఉండవల్లి అరుణ్ కుమార్. పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. స్వతహాగా న్యాయవాది. లిటిగేషన్లు పెట్టడంలో దిట్ట. తాజాగా ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం [more]
ఉండవల్లి అరుణ్ కుమార్. పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. స్వతహాగా న్యాయవాది. లిటిగేషన్లు పెట్టడంలో దిట్ట. తాజాగా ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లే కనపడుతుంది. ఉండవల్లి రాజేసిన కొత్త నిప్పు వైసీపీకి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఆయన ఎక్కువగా పుస్తకరచనలోనే పడిపోయారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపైనా ఆయన స్పందించినా అది నామమాత్రమేనని చెప్పాలి.
ఇరకాటంలోకి నెట్టారా?
అయితే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిట్టింగ్ పెట్టారంటున్నారు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసి బెంచ్ లను విశాఖ, అమరావతిలో ఏర్పాటు చేయాలని సూచించింది. జగన్ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తుంది.
హైకోర్టు బెంచ్ తో…..
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది కాబట్టి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ పెట్టాలన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ వాదన. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఉండవల్లి లేఖ రాశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖపై వైసీపీలో చర్చ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సెంటిమెంట్ కు మరోపేరు. ఇక్కడ అధిక స్థానాలు వస్తే వారే అధికారంలోకి వస్తారు. అలాగే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా కూడా ఇదే కావడంతో వైసీపీ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిట్టింగ్ తో పునరాలోచనలో పడినట్లు తెలిసింది.
పార్టీలో చర్చ…..
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తున్నందున మధ్యలో ఉంటే రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రతిపాదనను పరిశీలించే అవకాశముందంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖతో ఉభయ గోదావరి జిల్లాలకు అన్యాయం జరిగిందన్న వాదనను బలంగా తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన బాణం వైసీపీ శిబిరంలో సూటిగానే తగిలినట్లు కన్పిస్తుంది. మరి ఉండవల్లి లేఖపై చర్చ జరిపి హైకోర్టు బెంచ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.