ఇక అంతా “కల్పనే”

పామర్రు… టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ పామర్రులో టీడీపీకి ఇంతవరకు ఒక్క విజయం [more]

Update: 2019-11-28 09:30 GMT

పామర్రు… టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ పామర్రులో టీడీపీకి ఇంతవరకు ఒక్క విజయం కూడా దక్కలేదు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి డి‌కే దాసు విజయం సాధిస్తే, 2014లో వైసీపీ నుంచి ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ముందువరకు ఉప్పులేటి కల్పన టీడీపీలోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా జగన్ చెంతకు చేరి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

భారీ మెజారిటీతో…..

అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో ఉప్పులేటి కల్పన మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోయారు. ఇక ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించిన ఉప్పులేటి కల్పనని 2019 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. టీడీపీ తర‌పున పోటీ చేసిన ఉప్పులేటి కల్పనపై వైసీపీ అభ్యర్ధి కైలా అనిల్ కుమార్ దాదాపు 31 వేలపైనే మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి ఉప్పులేటి కల్పన పార్టీని గాలికొదిలేశారు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏవి చేయలేదు.

ఆమెను తప్పించాలని….

ఇటీవల జిల్లా విస్తృత స్థాయి సమావేశాలకు హాజరయ్యారైన తర్వాత కూడా ఉప్పులేటి కల్పన అంత ఎఫెక్టివ్ గా ఏం పని చేయడం లేదు. దీంతో ఉప్పులేటి కల్పన పట్ల టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గంలో కూడా టీడీపీకి ఇలాంటి పరిస్థితి ఉండటంతో వారు ఉప్పులేటి కల్పన తీరుపై ఫైర్ అవుతున్నారు. ఎలా అయిన ఆమెని తప్పించి వేరే సమర్ధమైన నాయకుడుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అధినేత చంద్రబాబు కూడా ఉప్పులేటి కల్పన పనితీరుపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

వర్ల రామయ్యకే మళ్లీ….

వచ్చే ఎన్నికల వ‌ర‌కు కాదు క‌దా.. ఇప్పుడే ఉప్పులేటి కల్పనను మార్చి కొత్త వ్యక్తికి బాధ్యత‌లు ఇవ్వాల‌ని చూస్తున్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పామ‌ర్రులో పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించేందుకు ఎవ్వరూ ముందుకు రాని ప‌రిస్థితి. అన్నీ కుదిరితే 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సీనియర్ నేత వర్ల రామయ్యకే మళ్ళీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. చూడాలి మరి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో టీడీపీని ఎవరు గట్టెక్కిస్తారో..?

Tags:    

Similar News