లాస్ట్ పంచ్ ఈయనదే అవుతుందా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కరోనా బారిన పడిన ట్రంప్ కోలుకుని తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ దూసుకుపోతున్నారు. ఎవరి వైపు విజయం [more]

Update: 2020-10-23 16:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కరోనా బారిన పడిన ట్రంప్ కోలుకుని తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ దూసుకుపోతున్నారు. ఎవరి వైపు విజయం ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. నవంబరు 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

భారతీయ ఓటర్లపైనే….

కరోనా వ్యాక్సిన్ పైనే డొనాల్డ్ ట్రంప్ నమ్మకం పెట్టుకున్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నామైనా, తన నిర్ణయాలతో తిరిగి నిలబెట్టగలిగానని ట్రంప్ వాదిస్తున్నారు. మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని ట్రంప్ అందుకున్నారు. అమెరికన్లకే ఉద్యోగాలంటూ ఆయన చేస్తున్న నినాదం కొంత అనుకూల ఫలితాలు అందిస్తాయంటున్నారు. ప్రధానంగా ట్రంప్ భారతీయ అమెరికన్ల ఓటర్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

మోదీని చూసి…..

మోదీ తనకు అనుకూలంగా ఉంటారన్న ప్రచారం కూడా ట్రంప్ కు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు మోదీ ని చూసి ట్రంప్ వైపే మొగ్గు చూపుతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతోంది. అయితే కరోనా సమయలో సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. దీని నుంచి ఆయన ఇప్పట్లో బయటపడటం కష్టమేనన్నది వాస్తవం.

సర్వేలు మాత్రం……

మరోవైపు జో బైడెన్ సయితం భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో జరుపుతున్న సర్వేలు కూడా ట్రంప్ కు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఎక్కువమంది అమెరికన్లు జోబైడెన్ కే మద్దతు తెలిపినట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. జోబైడెన్, కమలా హారిస్ కు 54 శాతం మంది అమెరికన్లు మద్దతు తెలిపితే, ట్రంప్, మైక్ పెన్స్ కు 44 శాతం మంది మాత్రమే అండగా నిలిచారు. దీంతో చివరి నిమిషంలో ట్రంప్ దూసుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News