వంశీకి ఉన్న విశ్వసనీయత ఇదే
వల్లభనేని వంశీ…. వైసీపీలోకి అనగానే మిత్రులతో రకరకాల చర్చలు, బోలెడు విషయాలు గుర్తుకు వచ్చాయి. 2005 నుంచి తెలిసిన అతని ప్రవర్తన…, నాటకీయత… వివాదాలు అన్ని కళ్ళ [more]
వల్లభనేని వంశీ…. వైసీపీలోకి అనగానే మిత్రులతో రకరకాల చర్చలు, బోలెడు విషయాలు గుర్తుకు వచ్చాయి. 2005 నుంచి తెలిసిన అతని ప్రవర్తన…, నాటకీయత… వివాదాలు అన్ని కళ్ళ [more]
వల్లభనేని వంశీ…. వైసీపీలోకి అనగానే మిత్రులతో రకరకాల చర్చలు, బోలెడు విషయాలు గుర్తుకు వచ్చాయి. 2005 నుంచి తెలిసిన అతని ప్రవర్తన…, నాటకీయత… వివాదాలు అన్ని కళ్ళ ముందుకి వచ్చాయి. లగడపాటి బెజవాడలో ఫ్లెక్సీలు పరిచయం చేసినట్టే….. వల్లభనేని ఫ్యాక్షన్ సినిమా రియాలిటీని ఊళ్ళోకి తెచ్చాడు. నల్లటి సఫారీ కాన్వాయ్…. బళ్ళు అన్నిటికీ 333 నంబర్లు…. వెనుక నల్లటి గొడుగు పట్టే మనిషి….. ఎదుటి వాళ్ళ ముందు చకచకా కదిలే కళ్ళు… వాటిలో అభద్రతా భావం….. నేరుగా కళ్ళలోకి చూడలేని తత్వం. ప్రెస్ మీట్ అవ్వగానే జర్నలిస్టులకు డబ్బులు పంచే అనుచరులు. బాగా చిల్లరగా ఉన్నాడే అనిపించేది.
పార్టీ ఆఫీస్ ను నడిపించి…..
2006లో పాత టీడీపీ ఆఫీస్ లో వినయంగా ఉండేవాడు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి గన్నవరం కావాలని పేచీ పెట్టాడు. అది కుదరక విజయవాడ పార్లమెంట్ స్థానం (మధ్యలో టీడీపీ లో బోలెడు గొడవలు….. 2004 తర్వాత బెజవాడలో పార్టీ ఆఫీస్ నడిపే వాళ్ళు కరువైతే ఆ ఖర్చులన్నీ వంశీ మీద నెట్టిన చాణక్యం దేవినేని ఉమామహేశ్వరరావుది. ఆయనకు వాళ్ళ అన్న నెహ్రూ@ కాంగ్రెస్ ఎమ్మెల్యే ని ఎదిరించే ధైర్యం అప్పటికి లేదు. నెహ్రూ కూడా తమ్ముడు ఎక్కడో ఒక చోట బలంగాఉండాలనే కోరిక. ఫలితంగా వాళ్ళ జేబులో డబ్బు ఖర్చు కాకుండా… పరిటాల బినామీ వంశీ చేత ఆ భారం మోయించిన చంద్ర బాబు చాణక్యం… 2009 ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు…?
నెహ్రూ వర్సెస్ వంశీ…..
టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వల్లభనేని వంశీ….. ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె ఇంట్లో డబ్బులు పంచుతున్నాడని నెహ్రూ గొడవకు దిగడం, ఆ రోజు వంశీ దుందుడుకు వైఖరి…. కార్ బ్యానెట్ మీద మీడియా కెమెరా వాళ్ళని లాక్కెళ్లిన కౄరత్వం…. తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగత జీవితం మీద నెహ్రూ వర్గం చేసిన చిల్లర ప్రచారం….. వాటికి కరపత్రాలు వేసి మళ్ళీ జెండాలు, ఫ్లెక్సీలతో తనకు అనుకూలంగా మార్చుకున్న లగడపాటి……. ఫలితాల తర్వాత నెహ్రూ -వంశీ మధ్య వ్యక్తిగత దూషణలు…. స్థూలంగా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని చరిత్ర.
పరిటాల బినామీగా….
ఇంత సినిమా నాటకీయత- ఎన్నికల్లో ఓటమి కంటే వేరే నేపథ్యం కూడా ఉంది…. అప్పట్లో పరిటాల మరణం తర్వాత జగన్ ప్రాణానికి ప్రమాదం ఉందని అప్పటి నిఘా బాస్ అరవింద రావు చెబితే…. “సీఎం వైఎస్ నేరుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావని పలకరించినట్టు మిత్రులు చెబుతారు…..” 2011 తర్వాత వైసీపీలో చేరేందుకు జరిగిన ప్రయత్నాలు రకరకాల కారణాలతో బెడిసి కొట్టాయి. కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర సమయంలో భారీ బైక్ ర్యాలీతో చేరేందుకు ప్రయత్నించినా అది ఫలించలేదు. అంతకు ముందు ఉన్న భూ వివాదాలు, మధ్యలో ఐపీఎస్ పి. సీతారామాంజ నేయులుతో గొడవ…, 333 బండి ఒక్కటి మాత్రమే నడవాలి అనే ఆంక్షలు…. సీపీ ఆఫీస్ లో అందరి ముందు గొడుగులు మూయించి వర్షంలో నడిపించిన సీన్ అప్పుడు చూసి అందరం ఆశ్చర్య పోయాం.
(వంశీ గురించి మరికొంత)