వంశీపై ఎందుకంత ప్రేమ?
నేను పార్టీలో ఉండను మొర్రో అంటున్నా ఎందుకు బతిమాలుతున్నట్లు? ఆయన లేకపోతే ఇక పార్టీ లేదా? పార్టీకి ఆయనే కావాలా? ఇదీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ [more]
నేను పార్టీలో ఉండను మొర్రో అంటున్నా ఎందుకు బతిమాలుతున్నట్లు? ఆయన లేకపోతే ఇక పార్టీ లేదా? పార్టీకి ఆయనే కావాలా? ఇదీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ [more]
నేను పార్టీలో ఉండను మొర్రో అంటున్నా ఎందుకు బతిమాలుతున్నట్లు? ఆయన లేకపోతే ఇక పార్టీ లేదా? పార్టీకి ఆయనే కావాలా? ఇదీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై కలుగుతున్న అనుమానాలు. నో డౌట్ వల్లభనేని వంశీ పట్టున్న లీడరే కావచ్చు. ఆయన వెళితే పార్టీకి ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు రావచ్చు. అంతమాత్రాన తాను పార్టీని వదలి వెళ్లిపోతానంటున్నా చంద్రబాబు ఎందుకు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నట్లు? వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబుకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల్లోనే కలుగుతున్న అనుమానాలు.
నలుగురు వెళ్లినా…..
నలుగరు రాజ్యసభలు పార్టీని వీడి వెళ్లినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. అదే ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎందుకింత తాపత్రయపడుతున్నారంటే…దానికీ ఒక కథ ఉంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోరు. వల్లభనేని వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వాట్సప్ మెసేజ్ పెట్టగానే దానికి ఓపిగ్గా చంద్రబాబు సమాధానమిచ్చారు. రెండో మెసేజ్ కు కూడా చంద్రబాబు చూసి ఊరుకోలేదు. వెంటనే రిప్లై ఇచ్చారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అయినా వల్లభనేని వంశీ వినడం లేదు.
ప్రయత్నం ఆగదని…..
వల్లభనేని వంశీని ఒప్పించడానికి పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణలను పంపారు. వారితో చర్చలు ఫలప్రదం కాలేదు. అయినా వల్లభనేని వంశీ కోసం చంద్రబాబు తన ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. వైసీపీ కండువా కప్పుకునేంత వరకూ తన ప్రయత్నం ఆగదని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. వల్లభనేని వంశీ అంటే చంద్రబాబు అత్యంత ఇష్టం. 2006లో టీడీపీలోకి వచ్చినా మూడేళ్లలోనే టిక్కెట్ ఇచ్చారు.
జూనియర్ సిఫార్సుతో…..
2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబు వల్లభనేని వంశీకి గన్నవరం సీటు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే వల్లభనేని వంశీకి టిక్కెట్ ఇచ్చారు. వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మంచి మిత్రులు. దీంతో ఆర్థికంగా చంద్రబాబు వంశీకి సహకరించారు. వల్లభనేని వంశీ జగన్ ను కలసిన వెంటనే కొందరు సీనియర్ నేతలు వంశీని సస్పెండ్ చేయమని చంద్రబాబుకు చెప్పారు. అయితే చంద్రబాబు అంగీకరించలేదు.
సింపతీ కోసమేనా?
ఇందుకు కారణం కూడా చెబుతున్నారు. తాను పార్టీ నుంచి ఒక్క కార్యకర్తను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరని చంద్రబాబు స్పష్టం చేయదలచుకున్నారు. వల్లభనేని వంశీ అంశాన్ని రాష్ట్ర స్థాయి అంశంగా తీసుకెళ్లి సానుభూతి పొందాలనుకుంటున్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు బతిమాలినా వంశీ వినలేదన్నది బలంగా జనంలోకి వెళ్లాలన్నది ఆయన యోచనగా ఉంది. ఇలా వల్లభనేని వంశీతో పాటు వైసీపీని కూడా ఇరుకున పెట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం. మరి ఏం జరుగుతుందో చూడాలి.