చేతులు కలిపినంత మాత్రాన…?

గన్నవరం వైసీపీలో రాజకీయ విభేదాలకు తెరపడినట్లేనా? జగన్ సూచనతో ఇద్దరు నేతలు కలసి పనిచేస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్. గన్నవరం నియోజకవర్గంలో గత [more]

Update: 2020-10-09 05:00 GMT

గన్నవరం వైసీపీలో రాజకీయ విభేదాలకు తెరపడినట్లేనా? జగన్ సూచనతో ఇద్దరు నేతలు కలసి పనిచేస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్. గన్నవరం నియోజకవర్గంలో గత కొద్దినెలలుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇక్కడ మొత్తం మూడు వర్గాలున్నాయి. ఒకటి వల్లభనేని వంశీది కాగా, మరొకటి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావు. మూడోది వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుది.

టీడీపీలో గెలిచి…..

2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించారు. యార్లగడ్డ వెంకట్రావుకు డీసీసీబీ ఛైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో విభేదాలు సమసిపోతాయని భావించారు. కానీ గత కొద్దిరోజులుగా మూడు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది.

ఒప్పుకునేదే లేదంటూ…..

ప్రధానంగా యార్లగడ్డ వెంకట్రావు తాన వల్లభనేని వంశీ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని, ఆయనతో సఖ్యతగా ఉండనని జగన్ కు ఎప్పుడో చెప్పానని తెలిపారు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా విభేదాలు తలెత్తాయి. కరోనా నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దీని వెనక ఎమ్మెల్యేలతో పాటు ఒక మంత్రి హస్తం ఉందని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు.

జగన్ కల్పించుకోవడంతో…..

అయితే తాజాగా పునాదిపాడులో విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ ఇద్దరికి సయోధ్య చేకూర్చే ప్రయత్నం చేశారు. వల్లభవనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు చేతులను కలిపి ఇద్దరూ కలసి పనిచేయాలని జగన్ వారికి సూచించారు. అయితే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు కలిసినా వారి క్యాడర్ కలవని పరిస్థితి నెలకొంది. వల్లభవనేని వంశీ టీడీపీ లో ఉన్నప్పుడువైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని, ఆయన నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని యార్లగడ్డ వర్గీయులు చెబుతున్నారు. జగన్ స్వయంగా కల్పించుకోవడంతో ఈ పరిస్థితి సద్దుమణగుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News