వంశీని కెలికితే అంతే మరి
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా ముఖ్యమంత్రి జగన్ ను కలసి చర్చించిన తర్వాత తాను [more]
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా ముఖ్యమంత్రి జగన్ ను కలసి చర్చించిన తర్వాత తాను [more]
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా ముఖ్యమంత్రి జగన్ ను కలసి చర్చించిన తర్వాత తాను రాజీనామా చేసి పార్టీలో చేరాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. వల్లభనేని వంశీ ఇప్పటి వరకూ పార్టీలోగుట్టును బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక టీవీ ఛానెల్ లో ఆయనపై విమర్శలు చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ పై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డబ్బు పంపిణీపైనా….
ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వంశీపై చేసిన విమర్శలను తట్టుకోలేకపోయారు. వల్లభనేని వంశీకి మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు రాజకీయంగా జన్మనిచ్చారని రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. తాను కష్టపడి గెలిచానని, గెలుపుగుర్రాలకే టిక్కెట్లు ఇస్తారన్న విషయం తెలియదా? అని బాబూ రాజేంద్రప్రసాద్ ను నిలదీశారు. అంతేకాదు రాజేంద్రప్రసాద్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చేతులు మారిన డబ్బులు గురించి కూడా వల్లభనేని వంశీ ప్రస్తావించారు.
రాజేంద్ర ప్రసాద్ పై….
పెనమలూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గెలుపునకు సహకరించడానికి రాజేంద్రప్రసాద్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తాను, సుజనాచౌదరి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి మరీ డబ్బులు ఇచ్చి వచ్చామని వల్లభనేని వంశీ చెప్పారు. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ కూతురు వివాహానికి కూడా పార్టీ నుంచి డబ్బులు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. పార్టీని వాడుకున్నది నీలాంటి భాజా భజంత్రీలేనని, తనకు చంద్రబాబుతో ఎటువంటి అటాచ్ మెంట్ లేదని, కేవలం సుజనా చౌదరితోనే తానకు సత్సంబంధాలున్నాయని వంశీ చెప్పడం విశేషం.
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పెట్టుబడులు…..
దీంతో పాటు నారాలోకేష్ ఆధ్యర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా విషయాన్ని కూడా వంశీ గుట్టు విప్పారు. నాలుగైదు వెబ్ సైట్లు పెట్టి వాటి ద్వారా టీడీపీలో తనకు వ్యతిరేకులపై వార్తలు రాయిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని నారాలోకేష్ పై వంశీ మండపడ్డారు. అంతటితో ఆగకుండా దేవినేని ఉమాపై కూడా ఫైరయ్యారు. బెంగళూరు, హైదరాబాద్ లలో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీల్లో భాగస్వామి ఎలా అయ్యారని దేవినేని ఉమాను వల్లభనేని వంశీ ప్రశ్నించారు. సాధారణ సినిమా హాల్లో క్యాంటిన్ ఓనరు సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానులు అవుతారా? అని ప్రశ్నించారు. మొత్తం మీద పార్టీ లోగుట్టులన్నింటినీ వల్లభనేని వంశీ బయటపెడుతుండటంతో ఆయన్ని టీడీపీ నేతలు కెలకకపోవడమే ఉత్తమంగా కన్పిస్తుంది.