గన్నవరం వైసీపీలో ఫుల్ సైలెంట్ ఏం జరిగింది?
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఇక్క డ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ [more]
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఇక్క డ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ [more]
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఇక్క డ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ చేశారు. అయితే, వైసీపీ గాలులు వీచినా ఆయన ఓడిపోయి టీడీపీ తరఫున వల్లభనేని వంశీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. అయితే, అనంతరకాలంలో ఆయన వైసీపీ బాటపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా ఎఫెక్ట్‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు మాసాల పాటు గన్నవరం రాజకీయాలే వినిపించాయి. అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు రావడం, ఇటు వైసీపీలోకి వల్లభనేని వంశీ జంప్ కావడం రాజకీయాలను వేడెక్కించాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
అంతేకాదు స్థానిక ఎన్నికల సమయంలోనూ వల్లభనేని వంశీ దూకుడు ప్రదర్శించారు. స్థానిక ఎన్నికలకు ముందు ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. జగన్ యార్లగడ్డను పిలిపించి కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అప్పటి వరకు వంశీ వర్సె స్ యార్లగడ్డ అన్నట్టుగా ఉన్న పరిస్థితి కొంత శాంతించింది. ఇక, మాజీ వైసీపీ ఇంచార్జ్ దుట్టా రామచంద్రరావు రంగంలోకి దిగినా.. వంశీ ఆయనతో సఖ్యతగా ఉంటూ.. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపారు. మొత్తంగా ఆయన తన వారికే సీట్లు ఇచ్చుకున్నారు. దీంతో ఈ విషయం కూడా కరోనాకు ముందు చర్చకు దారితీసింది.
కరోనా సమయంలో…..
తాను వైసీపీలోకి అధికారికంగా చేరకపోయినా.. సానుభూతిపరుడిగా మారిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ముందు తన సత్తా నిరూపించుకునేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ.. రాష్ట్ర ఎన్నిక ల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు వరకు ఐదారు నెలల పాటు అసెంబ్లీలోనూ.. అసెంబ్లీ బయటా చంద్రబాబును, లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వల్లభనేని వంశీ కరోనా సమయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు.
గన్నవరం నియోజకవర్గంలో…
మరోవైపు చంద్రబాబు పేరు చెప్పగానే అంతెత్తున లేచి విమర్శలు చేసే మంత్రి కొడాలి నాని వీలున్నప్పుడల్లా ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్‌ను ఏకేస్తున్నా వంశీ ఈ టైంలో స్లో అవ్వడం గన్నవరం నియోజకవర్గంలో కూడా చర్చకు వస్తోంది. అటు యార్లగడ్డ ఇప్పటికే గన్నవరంలో దుకాణం సర్దేసుకున్నారు. ఇప్పుడు అక్కడ అంతా వల్ళబనేని వంశీ రాజ్యమే నడుస్తున్నా సహజంగానే వంశీ ఎందుకు సైలెంట్ అయ్యాడా ? అని వైసీపీ, టీడీపీ కేడర్లో చర్చ నడుస్తోంది.