వంశీ ముందుచూపుతోనేనా?

టీడీపీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ వ్యూహం ఏంటి? ఆయ‌న ఊరికేనే రాజీనామా చేసేశారా? ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కొన్ని కోట్ల రూపాయ‌లు [more]

Update: 2019-10-29 09:30 GMT

టీడీపీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ వ్యూహం ఏంటి? ఆయ‌న ఊరికేనే రాజీనామా చేసేశారా? ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కి ఐదు మాసాలు కూడా గ‌డ‌వ‌క ముందుగానే రాజీనామా చేయ‌డం వెనుక వ్యూహం ఏంటి? అదే స‌మ‌యంలో టీడీపీ త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని చెబుతూనే.. న‌ర్మగ‌ర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుకు కృత‌జ్ఞత‌లు చెప్పడం వెనుక ఏదైనా స్ట్రాట‌జీ ఉందా? ఇప్పుడు మేధావుల‌ను సైతం తొలిచేస్తున్న ప్రశ్నలివి! నిజానికి రాజ‌కీయాల్లో ఉన్నవారు చిన్నవారైనా.. పెద్దవారైనా వారికంటూ ప్రత్యేకంగా వ్యూహాలేవీ లేకుండా ఉండే ప‌రిస్థితి ఉండ‌దు.

వైసీపీ నేతలతో స్నేహం….

వల్లభనేని వంశీ గురించి దృష్టి పెట్టినా.. ఆయ‌న కూడా వ్యూహం లేకుండా ఉత్తుత్తినే రాజీనామాలు చేయ‌డం, కేసుల‌కు భ‌య‌ప‌డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఉందంటే అంత తేలిక‌గా న‌మ్మే ప‌రిస్థితి లేదు. అదే స‌మ‌యంలో వల్లభనేని వంశీ బాబును కానీ, పార్టీని కానీ ఒక్క మాటంటే ఒట్టు. ఈ మొత్తం ప‌రిశీలిస్తే.. చాలా వ్యూహాత్మకంగానే వల్లభనేని వంశీ అడుగులు వేసిన‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న వైసీపీలోని కొంద‌రు నేత‌ల‌తో స‌ఖ్యత‌గా మెలిగారు. వారితో త‌న స్నేహాన్ని కొన‌సాగించారు. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, గుడివాడ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి కూడా అయిన కొడాలి నానితోను, పేర్ని వెంక‌ట్రామ‌య్య మ‌చిలీ ప‌ట్నం నుంచి ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నానితోనూ ఆయ‌న స్నేహం కొన‌సాగించారు.

ఒక్క మాట అనకుండా…..

2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేసిన‌ స‌మ‌యంలో జ‌గ‌న్ గ‌న్నవ‌రంలో ప‌ర్యటించిన స‌మ‌యంలోను ఆయ‌న‌తో క‌లిసి ఫొటోల‌కు ఫోజులిచ్చారు. అది పెద్ద విమ‌ర్శల‌కు కూడా దారి తీసింది. ఇలా టీడీపీలో ఉన్న స‌మ‌యంలోనే వల్లభనేని వంశీ వైసీపీ నేత‌ల‌తో స్నేహం చేశారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఒక్క దేవినేని ఉమాతో త‌ప్ప ఆయ‌న విభేదించిన నాయ‌కులు పెద్దగా ఎవ‌రూ లేరు. పైగా చంద్రబాబును గౌర‌వించే నాయ‌కుల్లోను వల్లభనేని వంశీ ముందున్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన త‌ర్వాత కూడా ఆయ‌నను ఒక్కమాట అన‌లేదు. పైగా త‌న‌కు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు కృత‌జ్ఞత‌లు చెప్పారు. స‌రే! రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ఇప్పుడు చెప్పినా.. రెండు నెల్లలోనే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయం.

ఒక్క మాట అనకుండా….

అయితే, వల్లభనేని వంశీ ఇప్పుడు వేసిన అడుగులు మాత్రం వ్యూహాత్మకంగానే ఉన్నాయి. త‌న‌ను తాను కాపాడుకునే క్రమంలో ఇటు వైసీపీతోను, అటు టీడీపీతోనూ ఆయ‌న చెలిమి చేయాల‌నే భావిస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది .. క‌నుక ఈ పార్టీలో చేరినా, 2024లో ఈ పార్టీ అధికారం కోల్పోయి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా త‌న ప్లేస్‌ను పోగొట్టుకోకుండా వల్లభనేని వంశీ ఇప్పటి నుంచే జాగ్రత్త ప‌డ్డార‌ని, అందుకే అధినేత చంద్రబాబుపై ఇంత విన‌యం చూపిస్తున్నార‌ని అంటున్నారు. సో.. మొత్తానికి రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో ఏం చేయాలో అలానే ఉంటూ.. అదే చేస్తున్నార‌ని వల్లభనేని వంశీ గురించి తెలిసిన వారు అంటున్నారు.

Tags:    

Similar News