వంశీ ప్లాన్ ఇదేనా?
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేశారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు. సాంకేతికంగా శాసనసభలో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లే. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ [more]
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేశారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు. సాంకేతికంగా శాసనసభలో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లే. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ [more]
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేశారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు. సాంకేతికంగా శాసనసభలో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లే. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే పరిస్థితిలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలనే వల్లభనేని వంశీ కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
పార్టీ నుంచి సస్పెండ్ కావాలని….
చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన శాసనసభలో స్వతంత్ర ఎమ్మెల్యే గా కొనసాగే వీలుంది. అందుకే వల్లభనేని వంశీ బంతిని చంద్రబాబు కోర్టులోకే నెట్టేశారు. అంటే చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించేంత వరకూ టీడీపీపై విమర్శలు చేయాలనే వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. తాను జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్లు నేరుగా వల్లభనేని వంశీ ప్రకటించి చంద్రబాబును ఇరకాటంలో నెట్టేశారు.
నారా లోకేష్ వల్లనే…..
ఇటు జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నానని చెబుతూనే మరోవైపు పార్టీని ఇరకాటంలో నెట్టేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ విషయం ప్రస్తావించి ఇబ్బంది పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నికల తర్వాత ఎందుకు ప్రచారంలో పాల్గొననీయకుండా చేశారని ప్రశ్నించారు. ముఖ్యంగా నారా లోకేష్ వల్లనే పార్టీ భ్రష్టుపట్టిపోతుందని తెలిపారు. తనకు పార్టీ టిక్కెట్ ఇచ్చామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు అదే టిక్కెట్ ఇచ్చి లోకేష్ ను ఎందుకు గెలిపించుకోలేకపోయిందన్నారు.
జగన్ కు మద్దతిస్తూనే…..
తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళల రుణాల రద్దు, రైతు రుణమాఫీని చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు అమలు చేయలేకపోయారన్నారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ వల్ల పార్టీ నేతలతో పాటు తాను కూడా ఇబ్బంది పడ్డానన్నారు. తాను త్వరలోనే వైసీపీలో చేరతానని వల్లభనేని ప్రకటించారు. మొత్తం మీద వల్లభనేని వంశీ ఎమ్మల్యే పదవికి రాజీనామా చేయకుండా చంద్రబాబును చికాకు పెట్టే ఉద్దేశ్యంలోనే వల్లభనేని వంశీ ఉన్నట్లు కనపడుతోంది.