గన్నవరంలో వంశీకి ట్రయాంగిల్ చెక్
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయం సరికొత్తగా యూటర్న్ తీసుకోనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న దుట్టా రామచంద్రరావు, [more]
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయం సరికొత్తగా యూటర్న్ తీసుకోనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న దుట్టా రామచంద్రరావు, [more]
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయం సరికొత్తగా యూటర్న్ తీసుకోనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుకు తోడు మరో నేత సైతం చేతులు కలిపారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్‌రావు సైతం వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఈ ఇద్దరు నేతలతో చేతులు కలపడంతో గన్నవరం వైసీపీ మరింత గరంగరంగా మారింది. వంశీకి వ్యతిరేకంగా బాలవర్థన్ రావు, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఒక్కటయ్యారు. వీరు తాజాగా దుట్టా ఇంట్లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పైకి ఓ ఫంక్షన్ కోసమే కలిశామని చెప్పుకుంటున్నా వీరి సమావేశం గన్నవరం వైసీపీ రాజకీయం నుంచి వంశీని పూర్తిగా తప్పించడమే లక్ష్యంగా సాగినట్టు తెలుస్తోంది.
వంశీకి వ్యతిరేకంగా….
వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచినా ఆ తర్వాత ఆ పార్టీని వీడి కొద్ది రోజులకే వైసీపీ సానుభూతిపరుడిగా మారిపోయారు. జగన్ సైతం వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీపై సుముఖంగానే ఉన్నారు. అయితే వంశీ చేతిలో గత రెండు ఎన్నికల్లో ఓడిన దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వంశీ వైసీపీ ఎంట్రీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పైగా వంశీ గన్నవరానికి తానే ఎమ్మెల్యేను, వైసీపీ ఇన్‌చార్జ్‌ను అని చెప్పుకోవడం ఈ రెండు వర్గాలకు మంటగా మారింది. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చి నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో పట్టు కోసం ప్రయత్నాలు చేయడం.. అటు వల్లభనేని వంశీకి మంత్రి కొడాలి నాని అండదండలు ఉండడంతో రెండు వర్గాల మధ్య ఫైటింగ్ మామూలుగా లేదు.
రంగంలోకి దాసరి సోదరులు…
ఇక గన్నవరం నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్ రావు, ఆయన సోదరుడు అయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్‌కు సైతం వంశీ అంటే పడదు. 2014లో వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచాక దాసరి సోదరులతో పాటు ఆయన వర్గాన్ని తీవ్రంగా అణిచి వేశారన్న దాసరి సోదరులు రగిలి పోతున్నారు. అందుకే గత ఎన్నికలకు ముందే దాసరి సోదరులు ఇద్దరు వైసీపీలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు కూడా వీరిని పట్టించుకోకపోవడం వీరి అసంతృప్తికి మరో కారణం.
వంశీకి బాబు ఫార్ములాయే …..
వల్లభనేని వంశీని గన్నవరం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించేయాలని దుట్టా, యార్లగడ్డ, దాసరి వర్గాలు బలంగా పట్టుబడుతున్నాయి. ఈ ముగ్గురు నేతల సమావేశంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు వర్గాలకు చెందిన నేతలను గెలిపించుకుని సత్తా చాటాక.. ఆ తర్వాత అధిష్టానం వద్ద సరికొత్త ఫార్ములాతో పంచాయితీ పెట్టేందుకు వీరు రెడీ అవుతున్నారు. 2009 ఎన్నికల్లో నాడు టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ, బాలవర్థన్ రావు ఇద్దరు గన్నవరం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడ్డారు. చంద్రబాబు మధ్యే మార్గంగా వంశీని విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ చేయించి.. బాలవర్థన్ రావును గన్నవరం అసెంబ్లీ బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో బాలవర్థన్ ఎమ్మెల్యేగా గెలిస్తే… విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు.
వంశీ విజయవాడ పార్లమెంటుకు…
ఈ క్రమంలోనే నాడు చంద్రబాబు వల్లభనేని వంశీకి అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు ఈ ముగ్గురు వైసీపీ నేతల త్రయం తెరమీదకు తెస్తున్నారు. వల్లభనేని వంశీని ఈ నాలుగేళ్లు ఏదోలా భరించి వచ్చే ఎన్నికల వేళ ఆయన్ను విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయించేలా చూడాలని… యార్లగడ్డను గన్నవరం అసెంబ్లీ బరిలోనే ఉంచేలా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పొలిటికల్ సలహాదారుగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇచ్చేలా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాలని వీరు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు తమ అనుచరులను భారీగా గెలిపించుకున్నాకే జగన్ వద్ద దీనిపై పంచాయితీకి రెడీ అవుతున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.