వైసీపీ-టీడీపీలే వల్లభనేని వంశీకి ఎసరు పెడతాయా..?
గన్నవరం ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న యువ నేత వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఆయన దూకుడు ఇలానే కొనసాగిస్తే.. ఏం జరుగుతుంది? అటు టీడీపీకి దూరమయ్యారు. [more]
గన్నవరం ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న యువ నేత వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఆయన దూకుడు ఇలానే కొనసాగిస్తే.. ఏం జరుగుతుంది? అటు టీడీపీకి దూరమయ్యారు. [more]
గన్నవరం ఎమ్మెల్యే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న యువ నేత వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఆయన దూకుడు ఇలానే కొనసాగిస్తే.. ఏం జరుగుతుంది? అటు టీడీపీకి దూరమయ్యారు. ఇటు వైసీపీలోకి వచ్చినా.. స్థానిక నేతలతో కలిసి మెలిసి సాగడం లేదు. దీంతో రోజుకో రచ్చ.. పూటకో రగడ తెరమీదికి వస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీని ఆది నుంచి దుట్టా రామచంద్రరావు మోశారు. తర్వాత గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు.. పార్టీని ముందుండి నడిపించారు. పార్టీలో ఓడిపోయిన తర్వాత కూడా యార్లగడ్డ యాక్టివ్‌గానేఉన్నారు. ఇక, యార్లగడ్డకు టికెట్ ఇప్పించుకున్నామనే దుట్టా కూడా వైసీపీని బలంగా ఇక్కడ పరుగులు పెట్టించారు.
తానే అంతా అయి…..
అలాంటి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ జంప్ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికలకు ముందు యార్లగడ్డ వర్సెస్ వంశీ తీవ్రస్తాయిలో రాజకీయం చేసుకున్నారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కానీ, వంశీ వైసీపీలోకి వచ్చేశారు. అయితే, ఆ గ్యాప్‌ను పోగొట్టుకునేలా వంశీ వ్యవహరించకపోవడం, పైగా ఆయన మరింత రెచ్చిపోయి.. వైసీపీ నేతలపై దూకుడు ప్రదర్శించడం వంటివి పెద్ద ఎత్తున కారణమవుతోంది. ఇదిలావుంటే, నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్ తానేనని వంశీ ప్రకటించుకున్నారు. వాస్తవానికి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. తనంతట తానే ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
వంశీకి వ్యతిరేకంగా…..
అంతేకాదు, పైకి అందరినీ కలుపుకొని పోతానని చెబుతున్నా.. వల్లభనేని వంశీ మాత్రం తెరవెనుక తన ఆధిపత్య తాను ప్రదర్శిస్తూనే ఉన్నారనేది వైసీపీ నేతల మాట. దీంతో వంశీకి వ్యతిరేకంగా వీరంతా ఒక్కటయ్యారు. వైసీపీలో ఇప్పుడు వంశీ ఒంటరయ్యారు. ఇదిలావుంటే. టీడీపీలో మంచి ఫామ్‌లో ఉన్న వంశీ.. అనూహ్యంగా బయటకు రావడం, వచ్చీరావడంతోనే లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేయడం, పార్టీ పరువును గంగలో కలిపేయడంతో టీడీపీ నాయకులు కూడా వంశీకి తగిన బుద్ధి చెప్పాలనే యోచనతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శత్రువుకుశత్రువు మిత్రుడు అవుతాడు.
ఇద్దరూ ఒక్కటై……
అనే ఫార్ములాను వైసీపీ నేతలు అమలు చేస్తున్నారని అంటున్నారు. అంటే.. అవసరమైతే.. టీడీపీతో కలిసి వల్లభనేని వంశీకి బుద్ధి చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్టు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రేపు ఒకవేళ టీడీపీ నుంచి జగన్‌కు సవాళ్లు ఎదురై.. వంశీతో రాజీనామా చేయించి తిరిగి ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తే.. ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వంశీకి బుద్ది చెప్పాలని వైసీపీ, టీడీపీ నేతలు భావిస్తున్నారట. మొత్తంగా ఈ పరిణామం చూస్తే.. వైసీపీ-టీడీపీ నేతల నుంచి వంశీకి తీవ్ర దెబ్బే ఎదురు కానుందని అంటున్నారు మరి ఏం జరుగుతుందో.. వంశీ ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.