వంశీ ప్రత్యర్థులు ఏమైపోయారు?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినప్పటి నుంచి ఆయనకు నియోజకవర్గంలో తన వైసీపీ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చన్న ఆశతో [more]
;
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినప్పటి నుంచి ఆయనకు నియోజకవర్గంలో తన వైసీపీ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చన్న ఆశతో [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినప్పటి నుంచి ఆయనకు నియోజకవర్గంలో తన వైసీపీ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చన్న ఆశతో ఫ్యాన్ కిందకు చేరిన వంశీకి ఆయన 2014 – 2019 ప్రత్యర్థులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావును నుంచి గట్టి పోటీయే వచ్చింది. తాము వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీని ఏ మాత్రం సహించమని ఈ ఇద్దరు నేతలు ఓపెన్‌గానే చెప్పేవారు. చివరకు జగన్ యార్లగడ్డను బుజ్జగించేందుకు ఆయన కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. వంశీతో రాజీతో ఉండాలని చెప్పారు.
ఇద్దరూ ఒక్కసారిగా….
అయితే దుట్టా, యార్లగడ్డ ఇద్దరూ ఒక్కటై వల్లభనేని వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. జగన్ సైతం ఈ ఇద్దరిని సైలెంట్‌గా ఉండాలని చెప్పినా ఎవ్వరూ వినలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. యార్లగడ్డకు ఏదో నామ్‌కే వాస్తేగా డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆయనకు ఏకంగా ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఆప్కాబ్ చైర్మన్ పదవి కాదుకదా.. చివరకు ఆయనకు ఉన్న డీసీసీబీ చైర్మన్ పదవి కూడా తీసేశారు.
పదవి తీసేసినా?
ఈ పదవిని జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన తన్నీరు నాగేశ్వరరావు తన్నుకుపోయారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చక్రం తిప్పి ఆ పదవి తన నియోజకవర్గానికి ఇప్పించుకున్నారు. జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిన యార్లగడ్డను జగన్ కావాలనే పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ సూచనకు భిన్నంగా వల్లభనేని వంశీతో రాజీ ధోరణి కంటే గొడవ ధోరణితోనే ముందుకు వెళ్లడం జగన్‌కు నచ్చలేదనే అంటున్నారు. అందుకే ఆప్కాబ్ చైర్మన్ వస్తుందని ఆశలు పెట్టుకున్న యార్లగడ్డకు చివరకు ఉన్న డీసీసీబీ కూడా తీసేశారు.
దుట్టాను కూడా సైడ్ చేసి…?
ఇక దుట్టా రామచంద్రరావు ఏకంగా ఎమ్మెల్సీ ఆశించారు. ఆయన అల్లుడును ఇక్కడ రంగంలోకి దింపి కొద్ది రోజుల పాటు వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా హల్‌చల్ చేయించారు. అయితే ఇప్పుడు ఆయన ఏమైపోయారో తెలియని పరిస్థితి. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డిని గన్నవరం నుంచి వంశీ తెలివిగా సైడ్ చేసేశారు. దుట్టా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయి.. చివరకు తన పనులు చక్క పెట్టుకుంటున్నారు. ఏదేమైనా వల్లభనేని వంశీతో ఢీ అన్న ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా వచ్చే ఎన్నికల వరకు కాకుండా ఇప్పుడే కనుమరుగైన పరిస్థితి.