ఆ ఒక్క త‌ప్పుతో.. జంపింగ్ నేత ఫ్యూచ‌ర్ కోల్పోయారా ?

రాజ‌కీయాల్లో ఉన్న వారు.. ప‌ద‌వులు కోల్పోయినా.. ఇప్పుడు కాక‌పోతే మ‌రోసారైనా విజ‌యం ద‌క్కించుకు నేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఓటు బ్యాంకును కోల్పోయినా.. సానుభూతిని.. ప్రజ‌ల‌లో విశ్వాసాన్ని [more]

Update: 2021-05-30 14:30 GMT

రాజ‌కీయాల్లో ఉన్న వారు.. ప‌ద‌వులు కోల్పోయినా.. ఇప్పుడు కాక‌పోతే మ‌రోసారైనా విజ‌యం ద‌క్కించుకు నేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఓటు బ్యాంకును కోల్పోయినా.. సానుభూతిని.. ప్రజ‌ల‌లో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి. అయితే.. ఈ విష‌యంలో మాత్రం జంపింగ్ జిలానీలు పేరుబ‌డ్డ నేత‌లు .. పూర్తిగా న‌ష్టపోతున్నారు. ఇలా ప్రజ‌ల్లో విశ్వాసాన్ని కోల్పోయారు.. వంత‌ల రాజేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు.

జగన్ జైలుకు వెళతారని..?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత విధేయురాలిగా గుర్తింపు పొందారు. ఆమెకు టిక్కెట్ రావ‌డ‌మే ల‌క్‌. అస‌లు అభ్యర్థి స్క్రూటీనిలో అభ్యర్థిత్వం మిస్ అవ్వడంతో డ‌మ్మీగా వేసిన వంతల రాజేశ్వరికి సీటు ద‌క్కడం.. ఆమె గెల‌వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే అనేక ఒత్తిళ్ల త‌ర్వాత వంత‌ల రాజేశ్వరి 2017లో వైసీపీని వీడి టీడీపీలోకి జంప్ చేశారు. నిజానికి ఆ స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజేశ్వరికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ, అప్పట్లో టీడీపీ నేత‌లు చేసిన ప్రచారానికి వంత‌ల రాజేశ్వరి ఫిదా అయ్యారని.. అందుకే.. పార్టీ మారార‌నే వాద‌న ఉంది. 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఉండ‌ద‌ని.. జ‌గ‌న్ జైలుకు వెళ్లిపోతా ర‌ని.. ప్రచారం చేసిన విష‌యం తెలిసిందే.

టీడీపీ నేతల మైండ్ వాష్ తో…?

దీంతో రాజ‌కీయంగా త‌న‌కు ఫ్యూచ‌ర్ ఉంటుందో.. ఉండ‌దో.. అనే ఉద్దేశంతో కేవ‌లం టీడీపీ నేత‌ల మైండ్ వాష్‌తో.. వైసీపీని వ‌దిలిపెట్టారు. కానీ, పార్టీ కేడ‌ర్ బ‌లంగా ఉన్న రంప‌చోడ‌వ‌రంలో వంత‌ల రాజేశ్వరి పార్టీ కేడ‌ర్‌, త‌న అనుచ‌రుల అభిప్రాయాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత వంత‌ల రాజేశ్వరి అడ్రస్ రాజ‌కీయంగా గ‌ల్లంతైన ప‌రిస్థితే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అస‌లు టికెట్ కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ఒక్క రాంగ్ స్టెప్ తో…?

నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కుమార్తెలు కాచుకుని ఉన్నారు. వీరిలో ఒక మాజీ ఎమ్మెల్యే కుమార్తె భ‌ర్త క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తి కావ‌డంతో ఆ ఈక్వేష‌న్లను కూడా పార్టీ అధిష్టానం ప‌రిశీలిస్తోంది. ఏదేమైనా వంత‌ల రాజేశ్వరి నాడు వైసీపీలోనే ఉండి ఉంటే.. ఈ రోజు పార్టీలో ఆమెకు రేంజ్ వేరుగా ఉండేది.. ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఆమెను రాజ‌కీయంగా అడ్రస్ లేకుండా చేసింది. విశాఖ జిల్లాకు చెందిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైతం అదే త‌ప్పుతో అడ్రస్ గ‌ల్లంతు చేసుకున్నారు.

Tags:    

Similar News