కుదిరితే కుర్చీ ఎక్కేందుకు….?
రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాజీ ముఖ్మమంత్రి వసుంధర రాజే నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి ఛాన్స్ వస్తుందేమోనన్న ఆశతో వసుంధర ఉన్నట్లే ఉంది. అందుకే వసుంధర [more]
రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాజీ ముఖ్మమంత్రి వసుంధర రాజే నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి ఛాన్స్ వస్తుందేమోనన్న ఆశతో వసుంధర ఉన్నట్లే ఉంది. అందుకే వసుంధర [more]
రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాజీ ముఖ్మమంత్రి వసుంధర రాజే నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి ఛాన్స్ వస్తుందేమోనన్న ఆశతో వసుంధర ఉన్నట్లే ఉంది. అందుకే వసుంధర రాజే వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ భవితవ్యం తేలనుంది.
సంబంధం లేనట్లే…..
నిజానికి వసుంధర రాజేకు, రాజస్థాన్ ప్రస్తుత రాజకీయాలకు సంబంధం లేదన్నట్లే బీజేపీ కూడా వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాజస్థాన్ రాజకీయాలన్నింటినీ ప్రస్తుతం గజేంద్ర షెకావత్ చూస్తున్నారు. ఆయనపైనే అశోక్ గెహ్లాత్ మండి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గజేంద్ర షెకావత్ బేరసారాలు ఆడుతున్న ఆడియో టేపులను కూడా బయటపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ అంతా గజేంద్ర షెకావత్ పైనే ఉంది.
ఉప్పందించింది…..
వాస్తవానికి సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు పద్దెనిమిది నెలల నుంచి మాటల్లేవు. అంటే దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇది గమనించిన వసుంధర రాజే బీజేపీ అధిష్టానానికి ఉప్పందించారని చెబుతున్నారు. అయిదే మధ్యప్రదేశ్ ఆపరేషన్ పెండింగ్ లో ఉండటంతో రాజస్థాన్ ను బీజేపీ అప్పట్లో హోల్డ్ లో పెట్టిందని చెబుతారు.
అధిష్టానం సూచనల మేరకే….
రాజస్థాన్ లో ఏదైనా జరిగి బీజేపీ అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నది వసుంధరరాజే ఆలోచన. అందుకే ఆమె వాటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు తనకు రాజస్థాన్ రాజకీయాలు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా వసుంధర రాజే ఖండించడం లేదు. అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతోనే వసుంధరరాజే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారన్న టాక్ ఉంది. కుదిరితే కుర్చీ ఎక్కేందుకు వసుంధర రెడీగా ఉన్నారని తెలుస్తోంది.