రాజమాత రగిలిపోతుంది అందుకేనా?

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే వేడి మొదలయింది. ముఖ్యమంత్రి [more]

Update: 2021-03-01 17:30 GMT

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే వేడి మొదలయింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలను నేతలు ప్రారంభించారు. రాజస్థాన్ లో సుదీర్ఘకాలంగా ఒక సెంటిమెంట్ ఉంది. అధికారంలో ఉన్న పార్టీ మరోసారి గెలిచే అవకాశాలు లేవు. అంటే 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి తన ప్రయత్నాలను ప్రారంభించారు.

మూడేళ్ల నుంచి….

వసుంధర రాజే గత మూడేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె పెద్దగా యాక్టివ్ గా లేరు. కేంద్ర నాయకత్వంతో కూడా వసుంధర రాజేకు పెద్దగా సంబంధాలు లేవు. గత ఎన్నికల సమయంలోనే వసుంధ రాజేను పక్కకు తప్పించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ సమయంలో కొంత సమర్థవంతంగానే వసుంధర రాజే ఎదుర్కొన్నారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించింది.

కేంద్ర నాయకత్వం….

ఇటీవల నియమించిన రాష్ట్ర కమిటీలోనూ వసుంధర రాజే వర్గానికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునీయాతో కూడా వసుంధర రాజేకు సత్సంబంధాలు లేవు. గత ఎన్నికల సమయంలోనూ ఇదే రకమైన ప్రయత్నాలు చేసినా చివరకు వసుంధర రాజే పైచేయిసాధించారు. అందుకే ఆమె నిశితంగా ఇప్పటివరకూ రాజకీయ పరిణామాలను గమనిస్తూ మౌనంగా ఉంటున్నారు. సచిన్ పైలట్ ను బీజేపీలోకి రానివ్వకుండా అడ్డుకోగలిగారు.

యాత్రకు రెడీ…..

ఇక మరోసారి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనంటూ కేంద్ర నాయకత్వానికి వసుంధర రాజే బలమైన సంకేతాలు పంపనున్నారు. మార్చి 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్ర ను వసుంధర రాజే ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కేవలం తన బలాన్ని నిరూపించుకోవడానికేనన్నది అందరికీ తెలిసిందే. ఈ యాత్రకు వచ్చే స్పందనపైనే బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయం ఆధారపడి ఉంటుందని భావిస్తున్న వసుంధర రాజే వర్గం పెద్దయెత్తున జనసమీకరణకు సిద్ధమయింది. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News