ఆ ప్రపోజల్ కు నో చెప్పిన వసుంధర

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అధినాయకత్వంతో అటో ఇటో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర నాయకత్వంతో మరోసారి చర్చించి నిర్ణయం [more]

Update: 2021-05-16 18:29 GMT

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అధినాయకత్వంతో అటో ఇటో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర నాయకత్వంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం వసుంధర రాజేను రాజస్థాన్ నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకు రావాలని భావిస్తుంది. ఈ మేరకు ఆమెకు పరోక్ష సంకేతాలను పంపినట్లు చెబుతున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి…

అయితే వసుంధర రాజే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెబుతున్నారు. తాను రాజస్థాన్ ను విడిచి పెట్టేది లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. వసుంధర రాజేతో పాటు యడ్యూరప్ప వంటి సీనియర్ నేతలను జాతీయ రాజకీయాల్లోకి గాని, గవర్నర్లుగా పంపాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. రాజస్థాన్ రాజకీయాలకు ఆమె దూరమయితేనే బాగుంటుందని పార్టీ నాయకత్వం రాయబారం పంపినట్లు చెబుతున్నారు.

ప్రాధాన్యత లేకుండా….

ఇప్పటికే వసుంధర రాజేను రాజస్థాన్ లో పార్టీ కార్యక్రమాల నుంచి పక్కకు తప్పించే కార్యక్రమం ప్రారంభమయింది. రాష్ట్ర పార్టీలో కూడా ఆమె వర్గానికి ప్రాధఆతనయత ఇవ్వలేదు. పార్టీని పూర్తిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సతీష్ పునియా తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతా ఆయన పర్యవేక్షణలోనే కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా తనకు గౌరవం లభించడం లేదని వసుంధర రాజే భావిస్తున్నారు.

చివరి ప్రయత్నంగా….

ఈ నేపథ్యంలో తాను జాతీయరాజకీయాల్లోకి గాని, గవర్నర్ గిరీని కాని తీసుకునేది లేదని వసుంధర రాజే కేంద్ర నాయకత్వానికి చివరి ప్రయత్నంగా స్పష్టం చేయబోతున్నారు. తనను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మాత్రమే ఆమె కోరనున్నారని తెలసింది. అయితే కేంద్ర నాయకత్వం ఇందుకు సుముఖంగా లేదు. దీంతో రాజస్థాన్ బీజేపీ రాజకీయాల్లో రానున్న కాలంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News