వెలగపూడికి బ్యాడ్ టైమ్ స్టార్టయిందా?

ఏపీలో విప‌క్ష టీడీపీలో కొంద‌రు ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్లు ఉన్నారు. వీరిలో చాలా మందికి జ‌గన్ గ‌త ఎన్నిక‌ల్లో చెక్ పెట్టేశారు. చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, ప‌రిటాల శ్రీరామ్ లాంటి [more]

Update: 2021-06-03 08:00 GMT

ఏపీలో విప‌క్ష టీడీపీలో కొంద‌రు ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్లు ఉన్నారు. వీరిలో చాలా మందికి జ‌గన్ గ‌త ఎన్నిక‌ల్లో చెక్ పెట్టేశారు. చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, ప‌రిటాల శ్రీరామ్ లాంటి ఫైర్ బ్రాండ్లుగా పిలుచుకునే నేత‌లే కాకుండా ఎంతో మంది సీనియ‌ర్లు సైతం గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. అయితే జ‌గ‌న్ ప్రభంజ‌నం ఈ స్థాయిలో ఉన్నా కూడా కొంద‌రు కీ రోల్ పోషించే నేత‌లు, ఫైర్‌బ్రాండ్లు విజ‌యం సాధించారు. గొట్టిపాటి ర‌వికుమార్‌, ఏలూరు సాంబ‌శివ‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు లాంటి నేత‌లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. ఇలాంటి వారిలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు ఒక‌రు. కృష్ణా జిల్లా పెద‌పారుపూడికి చెందిన ఆయ‌న విశాఖ‌లో రెండు ద‌శాబ్దాల క్రిత‌మే కాలు మోపారు.

మూడు సార్లు లక్కే…?

టీడీపీలో చిన్న కార్యక‌ర్తగా కెరీర్ స్టార్ట్ చేసి విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాన్ని అడ్డాగా చేసుకుని మూడు సార్లు ఓట‌మి లేకుండా వ‌రుస‌గా వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. వెల‌గ‌పూడి మూడు సార్లు గెలిచినా.. మూడు సార్లు ఆయ‌న గెలుపున‌కు ఏదో ఒక ల‌క్ చిక్కింది. బ‌ల‌హీన ప్రత్యర్థులో లేదా ఇత‌ర పార్టీల్లో స‌మీక‌ర‌ణ‌లో, ట్రయాంగిల్ ఫైటో జ‌రిగి వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వేవ్‌లో ఆయ‌న 25 వేల ఓట్ల మెజార్టీతో గెల‌వ‌డానికి ప్రధాన కార‌ణం వైసీపీ నుంచి బ‌ల‌మైన ప్రత్యర్థి లేక‌పోవ‌డ‌మే. అప్పటి వ‌ర‌కు భీమిలి ఇన్‌చార్జ్‌గా ఉన్న అక్కర‌మాని విజ‌య‌నిర్మల‌కు తూర్పు సీటే ఇవ్వడ‌మే జ‌గ‌న్ చేసిన రాంగ్‌స్టెప్‌.

ఆపరేషన్ స్టార్ట్…..

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబుకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ మార్క్ ఆప‌రేష‌న్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పార్టీ వ్యవ‌హారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న విజ‌య‌సాయి రెడ్డి తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై బాగా ఫోక‌స్ చేస్తూ వ‌స్తున్నారు. అక్కడ ఇన్‌చార్జ్‌గా విజ‌య‌నిర్మల‌నే కొన‌సాగిస్తూ.. తెర‌వెన‌క చ‌క్రం అంతా విజ‌య‌సాయే తిప్పేస్తున్నారు. విశాఖ న‌గ‌రంలో నార్త్‌లో గంటా దెబ్బతో టీడీపీ వీక్ అయ్యి వైసీపీ స్ట్రాంగ్ అయ్యింది. దక్షిణంలో వాసుప‌ల్లి వైసీపీ చెంత చేరిపోయారు. ప‌శ్చిమంలో గ‌ణ‌బాబు ఎప్పుడు అయినా సైకిల్ ఎక్కేయ‌వ‌చ్చని టాక్‌? అందుకే తూర్పు మీద బాగా ఫోక‌స్ పెట్టిన విజ‌య‌సాయి వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబును దెబ్బకొట్టేందుకు ఉన్న చిన్న అవ‌కాశం కూడా వ‌దులుకోవ‌డం లేదు.

పట్టు సడలుతోందా?

విశాఖ‌ను ఎగ్జిగ్యూటివ్ క్యాపిట‌ల్‌గా అంగీక‌రించ‌ని ఆయ‌న్ను టార్గెట్‌గా చేసుకుని ఓ బ‌ల‌మైన వ్యతిరేక ప్రచారం ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లారు. ఆయ‌న భూక‌బ్జాలు, లిక్కర్ దందాలు బ‌య‌ట పెట్ట‌డంతో పాటు విశాఖ ఎంపీ ఎంవీవీ కూడా క‌మ్మ నేతే కావ‌డంతో ఆయ‌న ద్వారా వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబుకి కొమ్ము కాసే బ‌ల‌మైన క‌మ్మ నేత‌ల‌ను కూడా వైసీపీ వైపు తిప్పేశారు. సంవత్సరాలుగా ఆయ‌న వెంటే ఉంటోన్న క‌మ్మ బ‌డా బాబులు ఇప్పుడు వైసీపీ చెంత చేరిపోవడంతో వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు కొమ్మలు విరిచేసిన‌ట్లయ్యింది. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటి వ‌ర‌కు ఆయ‌నకే స‌పోర్ట్ చేస్తోన్న యాద‌వుల్లో మెజార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లు, కేడ‌ర్ టీడీపీకి, ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. ఈ ప‌రిణామాల‌తోనే తూర్పులో ఇటీవ‌ల జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీ మెజార్టీ డివిజ‌న్లు గెలుచుకుంది. ఏదేమైనా వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబుచుట్టూ విజ‌య‌సాయి అష్టదిగ్భంద‌నం వేయ‌డంతో ఆయ‌న కూసాలు క‌దులుతున్నాయి. ఆయ‌న ప‌ట్టు స‌డ‌లుతోంద‌న్నది వాస్తవం.

Tags:    

Similar News